నిద్రలో నడిచే అలవాటు అనేది ఒకటి ఉందని మనం కేవలం సినిమాల్లో చూడడమే తప్పించి నిజజీవితంలో అలాంటి సంఘటనలు ఎదురుకావడం చాలా అరుదనే చెప్పాలి. కానీ మహబూబ్ నగర్ జిల్లా కి చెందిన వ్యక్తి మాత్రం నిద్రలోనే రావడమే కాదు ఏకంగా కరెంటు స్తంభాలు కూడా ఎక్కేస్తున్నాడు. వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదూ. అయితే స్లీపింగ్ స్పైడర్ మాన్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే...

 

మహబూబ్ నగర్ లో నందినగర్ కాలనీకి చెందిన ఒక యువకుడు రాత్రి సమయంలో విద్యుత్ స్తంభం వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. దానిపైకి ఎక్కి ఎటువంటి ఆధారాలు లేకుండా అనేకమైన ఫీట్లు చేశాడు. అలా ఒక రేంజ్ లో నిలబడ్డ అతనిని గమనించిన ఒక వ్యక్తి వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు కరెంట్ ను నిలిపివేశారు. కింద పోగైన జనం ను ఏమాత్రం పట్టించుకోకుండా తన పార్టీకి తాను జిమ్నాస్టిక్స్ చేస్తూ ఉండిపోయాడు యువకుడు. అసలే ఇక్కడ ఏం జరగబోతోందా అని అందరూ ఆందోళన చెందుతూ ఉండగా అంతలోనే అక్కడికి పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది వచ్చేశారు.

 

ఇంక పోలీసులు వచ్చి అతనిని కిందకి దిగమని ఆదేశించగా అతని కొద్దిసేపటికి కిందకి దిగాడు. తర్వాత అతనిని కరెంటు స్తంభం ఎందుకు ఎక్కావు అని ప్రశ్నించగా తాను ఏదో నిద్రమత్తులో ఎక్కానని.... అసలు తనకు ఏమీ గుర్తు లేదు అని చెప్పుకుంటూ తనకు నిద్రలో నడిచే అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది అని చెప్పి పోలీసు వారిని విస్మయపరిచాడు. ఇది విన్న పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. యువకుడు చెప్పిన మాటలపై అనుమానం రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు కూడా అతనికి నిద్రలో నడిచే అలవాటు ఉందని తెలియదని పేర్కొన్నారు. అతడు కావాలనే డ్రామాలు అడుతున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: