ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకీ మరింత ప్రభావవంతంగా మనుషులను శవాలుగా మారుస్తోంది. డబ్ల్యు.హెచ్. కూడా దీనిని ఒక అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా పరిగణిస్తూ ప్రపంచ దేశాలన్నింటికీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. చైనాలో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది వ్యాధి బారిన పడ్డారు. కేరళ లో నిన్నటి అర్ధరాత్రి వరకూ ముగ్గురు కరోనా వైరస్ బాధితులను గుర్తించగా చైనా కాకుండా వేరే దేశం లో కరుణ వైరస్ వల్ల మొదటి వ్యక్తి చనిపోయాడు. ఘటన ఫిలిప్పీన్స్ లో జరిగింది.

 

అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు అంతా దీనికి పరిష్కారంగా ఒక మందు కనిపెట్టేందుకు నానా తంటాలు పడుతుంటే వారి పరిశోధనలో ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఏదైనా ఒక వ్యాధి వైరస్ దాడి వల్ల వచ్చింది అంటే…. మొదటగా వైరస్ ఒక మనిషి యొక్క రక్తకణాలను దాడి చేసి.... దానిని ఆహారంగా భుజించి తన సంఖ్యను గణనీయంగా అభివృద్ధి పరుచుకుంటుంది. సంఖ్య ఒక స్థాయికి చేరిన తర్వాతే మనిషిలో వ్యాధి తాలూకు లక్షణాలు కనపడడం మొదలవుతాయి. సూక్ష్మజీవుల వల్ల వచ్చే వ్యాధుల అన్నింటికీ ప్రక్రియ కామన్ అయినా కూడా కరోనా వైరస్ కు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది అదే ఇప్పుడు సైంటిస్టులను సైతం భయభ్రాంతులకు గురి చేస్తోంది.

 

ఏదైనా వ్యక్తికి ఫలానా వ్యాధి సోకింది అని తెలుసుకోవాలంటే అతని ఒంటి తీరు మరియు శరీరంలో మార్పులు ని బట్టి మనం ఒక అంచనాకు రావచ్చు. అలాగే మామూలుగా వైరస్ కూడా తాను పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన తర్వాతే మనిషి శరీరంలో తన ప్రభావాన్ని చూపించి లక్షణాలను బయట పెట్టిన తర్వాతే ఏదైనా మీడియం ద్వారా ఇతర వ్యక్తి లోనికి వెళ్లి అవతలి వ్యక్తికి కూడా వ్యాధిని కలుగజేస్తుంది. ఖచ్చితంగా చెప్పాలంటే ఒక వ్యక్తిలో వ్యాధి యొక్క లక్షణాలను కనబరచకముందు ఒక వైరస్ మరొక వ్యక్తిలో ఎటువంటి ప్రభావం చూపించలేదు.

 

కానీ కరోనా మాత్రం ఇందుకు భిన్నం. మనకి ఎదుటి వ్యక్తి కి వైరస్ సోకిందని అనుమానం వచ్చి అతనికి దూరంగా ఉండే వీలు లేకుండా వ్యాధిగ్రస్తుడు కూడా అలాగే సాధారణమైన మనిషిలా మనకు కనిపిస్తాడు కానీ వైరస్ చాలా ప్రశాంతంగా మనల్ని కూడా బలి తీసుకుంటుంది. అందుకే దీనిని అత్యంత ప్రాణాంతకమైనదిగా మరియు ప్రమాదకరమైంది గా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: