మళయాళ పరిశ్రమ నుండి నేను శైలజా సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసిన భామ కీర్తి సురేష్. ఆ సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు తన సహజ నటనతో ఇక్కడ ఫ్యాన్స్ ను ఏర్పరచుకుంది. మన పక్కింటి అమ్మాయిలా ఉండే కీర్తి సురేష్ నటనకు ప్రేక్షకులంతా ముగ్ధులయ్యారు. ఇక మహానటి సినిమాతో ఆమె చూపించిన అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజంగా ఆ సావిత్రమ్మే ఆమెలో దూరి అలా చేయించిందా అనేలా తన నటనతో ఆకట్టుకుంది కీర్తి సురేష్. 

 

ప్రస్తుతం తెలుగులో మిస్ ఇండియా తమిళంలో మరో రెండు సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ ఈమధ్య బాగా బక్కచిక్కినట్టు అనిపిస్తుంది. అసలు తింటుందో లేదో కాని చాలా పలచగా తయారైంది. కొంతమంది బొద్దుగా ఉంటేనే ముద్దుగా ఉంటారు. మరి అమ్మడికి జీరో సైజ్ పై మోజు పెరిగిందో ఏమో కాని కీర్తి సురేష్ లేటెస్ట్ పిక్స్ ఆమె ఫ్యాన్స్ ను నిరాశపరుస్తున్నాయి. ఎప్పుడు మొఖంలో నవ్వు కనిపించే కీర్తి సురేష్ ఇప్పుడు అంద వికారంగా కళాహీనంగా కనిపిస్తుంది. దీనికి కారణం ఆమె తీసుకునే డైటా లేకా మరోటా అన్నది తెలియదు కాని కీర్తి సురేష్ లేటెస్ట్ పిక్స్ ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేస్తున్నాయి.

 

ఇక మోడ్రెన్ డ్రెస్ లో అమ్మడు చేస్తున్న ఈ ఫ్యాషన్ షో చూపరులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నా కాస్టూంస్ మీద పెట్టిన శ్రద్ధ తన లుక్ విషయంలో పెట్టట్లేదు అన్నది అందరు అంటున్న మాట. ఏది ఏమైనా కీర్తి సురేష్ అనగానే మదిలోకి గుర్తుకొచ్చే ఆ అందమైన చిరునవ్వు కూడా ఇప్పుడు మాయమైంది మరి తనలో ఏది ప్లస్సు ఏది మైనస్సు అన్నది తెలుసుకుని ఆ విధంగా ప్రయత్నిస్తే బెటర్ లేదంటే ఇలా అంద వికారంగా మారితే మాత్రం ఆమెకు ఉన్న ఫ్యాన్స్ కూడా ఆమెను ఫాలో అవడం మానేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: