అప్పటిదాకా ప్రిన్స్ గా ఉన్న మహేష్ కాస్త సూపర్ స్టార్ చేసిన సినిమా అది.. అప్పటివరకు ఇండస్ట్రీ రికార్డులు బద్ధలు కొట్టే స్టామినా మహేష్ కు ఉంటుందని ఊహించలేదు.. కాని ఆ సినిమాతో ఆ లెక్కలన్ని మార్చేశాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటనేగా మీ డౌట్ అదే మహేష్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి. పూరి టేకింగ్, మహేష్ యాక్టింగ్, ఇలియానా అందాలు, మణిశర్మ మ్యూజిక్ ఒకటేంటి ఈ సినిమా హిట్టుకి ప్రతి ఒక్కటి కారణం అని చెప్పొచ్చు. ఇక ఇదిలాఉంటే తెర మీదకు పోకిరిగా వచ్చిన ఈ సినిమా తెరవెనుక జరిగిన కథ గురించి ఈరోజు తెలుసుకుందాం.

 

పూరి జగన్నాథ్ మొదటిసారి మహేష్ ను కలిసి ఉత్తం సింగ్ అంటూ ఈ సినిమా టైటిల్ తో సహా కథ చెప్పాడట. ఇందులో హీరో పాత్ర పంజాబ్ నుండి వస్తాడట.. అలా వచ్చి ముందు రౌడీలతో కలిసి పనిచేసి చివరకు అండర్ కవర్ కాప్ అని రివీల్ అవుతుందట అని కథ చెప్పాడట. అయితే లైన్ బాగుందని చెప్పిన మహేష్పంజాబ్ బ్యాక్ డ్రాప్ కాకుండా మనదగ్గరే అన్నట్టుగా కథ సిద్ధం చేయమని చెప్పాడట. అంతేకాదు ఉత్తం సింగ్ అనే టైటిల్ అంతగా బాగాలేదని కూడా చెప్పాడట. అందుకే పోకిరి అని సజెస్ట్ చేయడంతో ఇదేదో బాగుందని ఓకే చేశారట.

 

అంతేకాదు సినిమాలో హీరో పాత్ర పండుగాడు అని పెట్టాడు. పూరి తన వైఫ్ లావణ్యాని పండు అనే పిలుస్తాడట. అలా పండుగాడు అంటూ హీరో పాత్రని డెవలప్ చేశాడట. సినిమా ఎడిటింగ్ పూర్తయి ఫస్ట్ కాపీ అయ్యాక కూడా ఎడిట్ సూట్ వాళ్లు మిగతా వాళ్లు సినిమా కచ్చితంగా ఫెయిల్ అవుతుందని అన్నారట. కాని మహేష్, పూరి మాత్రం సినిమా మీద నమ్మకంగా ఉన్నారట. మహేష్ కెరియర్ లో పోకిరి ప్రత్యేక స్థానంలో ఉంటుందని కచ్చితంగా చెప్పొచ్చు. ఆ సినిమాతోనే మహేష్ కు బలమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: