సైరా సక్సెస్తో జోరు మీదున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సక్సెస్ఫుల్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. హైదరాబాదులోని కోకాపేటలో భారీ సెట్ వేయగా అక్కడ ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. అయితే కొరటాల శివ సినిమా అంటే మెసేజ్ ఓరియంటెడ్ సినిమా గా ఉంటుంది కాబట్టి ప్రస్తుతం చిరంజీవి తో కూడా మెసేజ్ ఓరియంటెడ్ సినిమానే తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి దేవదాయ శాఖ అధికారి గా కనిపించబోతున్నాడు అని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు  ఈ సినిమాకు సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 

 

 

 కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో ఓ కీలక పాత్రలో టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబును నటింపజేసేందుకు చిత్రబృందం సంప్రదిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో నటించడానికి మోహన్ బాబు  గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా  అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మోహన్ బాబు సినిమా చేయడానికి ఒప్పుకుంటే సినిమాలో విలన్ గా కనబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మోహన్ బాబు మెగాస్టార్ చిరంజీవి మధ్య ఉన్న అనుబంధం గురించి అయితే కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడ కలిసిన టామ్ అండ్ జెర్రీ లాగా ఒకరిమీద ఒకరు పంచులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. 

 

 

 అంతేకాకుండా ఈ ఇద్దరు గతంలో కొన్ని సినిమాల్లో  కూడా కలిసి నటించారు. ఇక ఇన్నేళ్ల  తర్వాత వీరిద్దరూ కలిసి ఒక్క తెరపై కనిపిస్తే చూడాలని అభిమానులు కూడా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా చారిత్రాత్మకమైన సినిమా కావడంతో ఈ సినిమాలో చిరంజీవి డాన్సులు మాస్ డైలాగ్లు చూడలేమని అభిమానులు నిరాశతో  ఉన్నారు కానీ ప్రస్తుతం కొరటాల శివ  సినిమాలో అన్ని పుష్కలంగా ఉండేలా చూసుకుంటూనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయినట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమా కోసం చిరంజీవి బాగా స్లిమ్ గా తయారయ్యారూ. ఇకపోతే ఈ సినిమాలో మోహన్ బాబు  నటిస్తారా లేదా అన్నది చూడాలి మరి...!

మరింత సమాచారం తెలుసుకోండి: