నాటికాలంలో సినిమాల్లో నటించే నటీనటుల మధ్య ఉన్న స్నేహపూరితమైన వాతావరణం నేడు దాదాపుగా కనిపించడం లేదు. వీరికి తగ్గట్టుగానే అభిమానులు కూడా తయారు అయ్యారు. సినిమాలు తీసే వారు, బాగానే ఉంటారు, నటించిన వారు బాగానే ఉంటున్నారు. మధ్యలో ఫ్యాన్సే తన్నుకు చస్తున్నారు. నిజాయితీగా ఇలాంటి విషయాల్లో ఆలోచిస్తే సినిమా అనేది ఒక వినోదం మాత్రమే. బ్రతకడానికి మనుషులు వివిధరకాలైన పనులను ఎలా చేస్తున్నారో, అలాగే సినిమా అనే పరిశ్రమలో కూడా నటీనటులు శ్రమిస్తున్నారు.

 

 

దీన్ని అర్ధం చేసుకోకుండా, వినోదంగా భావించి ఆదరించ వలసిన సినిమాలకోసం పోటీ పడుతూ, మా హీరో అంటే మా హీరో అని బజారుకెక్కి అరవడం ఇది అభిమానం అనిపించుకోదు. వెర్రితనం, పిచ్చితనం అనిపించుకుంటుంది. మీకూ ఏదైనా కష్టం వస్తే మీ అమ్మ, నాన్నా, మీ అన్నో, తమ్ముడో చెల్లినో అవసరానికి ఉపయోగపడతారే గాని సినిమా హీరోలు వచ్చి మీ అవసరాలు తీర్చరు. ఎందుకు ఇన్ని ఇన్ని చదువులు చది, ఇంతటి పరిజ్ఞానాన్ని సంపాదించుకుని ఇలా వెర్రి వారిలా ప్రవర్తించడం..

 

 

ఇక  తాజాగా ఈ సంక్రాంతికి ఫ్యాన్స్ చేసిన హంగామాకు అంతా ఇంతా కాదు. ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరూ, అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాలు పోటా పోటీగా  విడుదలవడం, రెండు సినిమాలు రెండొందల కోట్లు వసూలు చేశాయంటూ ఒకరిని మించి ఒకరు పోస్టర్స్ వేసుకోవడం .. సక్సెస్ మీట్స్ పెట్టడం .. సోషల్ మీడియాలో రికార్డ్స్ హంగామా చేయడం .. ముఖ్యంగా నాన్ బాహుబలి రికార్డ్స్ అంటూ రెండు సినిమాలు గొప్పలు చెప్పుకోవడం లాంటి చేష్టలతో అటు మహేష్, ఇటు బన్నీ ఫాన్స్ మధ్య వార్ ఓ రేంజ్ లో సాగింది..

 

 

ఈ ఘటనలపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ  గట్టి కౌంటర్ వేస్తు, సోషల్ మీడియాలో సెటైరికల్ వీడియో ఒకటి చేసారు. మహేష్, బన్నీ మాస్క్ లతో ఉన్న ఇద్దరు కొట్టుకుంటున్నట్టు, అభిమానులు గొడవలు పడుతున్నట్టు చూపించారు. ఆ తరువాత మీకు ఎం పోయేకాలం రా .. ఇద్దరు హీరోలు బాగానే ఉన్నారు . .నాన్ బాహుబలి రికార్డ్ మాదంటే మాది అంటూ ఎందుకు కొట్టుకుంటున్నారు. సినిమా చరిత్రలో ఇప్పటి వరకు బాహుబలిదే రికార్డు .. మీ హీరోల సినిమాలు ఆ రికార్డును దాటితే మీరంతా మాట్లాడండి అంటూ భరద్వాజ ఘాటుగానే ఫైర్ అయ్యాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: