‘అల వైకుంఠపురములో’ ఇండస్ట్రీ హిట్ గా మారిన తరువాత త్రివిక్రమ్ కొంత గ్యాప్ తీసుకుని ఇదే సంవత్సరం జూనియర్ తో మరొక సినిమా చేయడం ఖాయం అయింది. ఈమధ్య ‘అల’ సూపర్ సక్సస్ తరువాత త్రివిక్రమ్ జూనియర్ ను కలిసి తామిద్దరం కలిసి చేయబోయే మూవీ ప్రాజెక్ట్ గురించి ప్రాధమికంగా చర్చలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈచర్చలలో జూనియర్ సున్నితంగా త్రివిక్రమ్ కు కొన్ని సూచనలు చేసినట్లు టాక్. ‘అత్తారింటికి దారేది’ 'S/o సత్యమూర్తి' ‘అజ్ఞాతవాసి’ ‘అల వైకుంఠపురములో’ ఈ సినిమా కథలన్నీ ఇంచుమించు ఒకేరకంగా ఉన్నాయి అన్న విమర్శలను త్రివిక్రమ్ దృష్టికి తీసుకు వస్తూ అలాంటి విమర్శలు రాకుండా ఒక మంచి కథను ఎంచుకోమని సూచించినట్లు తెలుస్తోంది. 

నాన్న కొడుకు ఒక పెద్ద ఇల్లు ఆ ఇంట్లో వ్యక్తుల మధ్య జరిగే సంఘర్షణ. ఇంట్లోనుంచి బయటకు రావడం లేదా లోపలికి వెళ్లడం లాంటి కామన్ పాయింట్ లేకుండా ఈసారి తనతో తీయబోయే కథకు ఒక డిఫరెంట్ యాంగిల్ ఆలోచించమని త్రివిక్రమ్ కు జూనియర్ సూచన చేసాడు అంటూ గాసిప్పులు వస్తున్నాయి. ఇప్పటికే ‘అల వైకుంఠపురములో’ మూవీని చూసిన కొంతమంది విమర్శకులు ఈ సినిమాకు ‘నాన్నారింటికి దారేది’ అనే టైటిల్ పెడితే బాగుండేది అన్న కామెంట్స్ వచ్చిన నేపధ్యంలో ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని జూనియర్ త్రివిక్రమ్ కు ఇలాంటి సలహా ఇచ్చి ఉంటాడు అని భావిస్తున్నారు.

తెలుస్తున్న సమాచారం మేరకు జూనియర్ తో త్రివిక్రమ్ చేయబోయే మూవీ కథ చెల్లి సెంటిమెంట్ తో ఉంటుంది అని అంటున్నారు. ఒకప్పుడు ఈ సెంటిమెంట్ తో చాలమంది టాప్ హీరోలు భారీ హిట్స్ అందుకున్నారు. ఈ సెంటిమెంట్ ను అంతర్లీనంగా కథలో కొనసాగిస్తూ ఒకప్పటి జంధ్యాల మార్క్ సినిమాలు లా పూర్తి కామెడీ సీన్స్ తో త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ తో ఉండే విధంగా జూనియర్ మూవీ ఉంటుంది అని ఊహాగానాలు వస్తున్న నేపధ్యంలో జూనియర్ త్రివిక్రమ్ కు ఇచ్చిన సలహాలతో ఇప్పుడు కథలో మార్పులు జరిగానా ఆశ్చర్యం లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: