పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం ఈ మూడు సినిమాలతో స్టార్ రేంజ్ కు ఎదిగిన విజయ్ దేవరకొండ తన ప్రతి సినిమాతో తన ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా అంచనాలను అందుకోలేదు ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఆ సినిమాతో మళ్లీ హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. ఈ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ డైరక్షన్ లో సినిమా ఓకే చేశాడు. ఈమధ్యనే ఆ సినిమా షూటింగ్ మొదలైంది. తెలుగులో ఉన్న దర్శకుల్లో పూరి స్టైలే వేరు. 

 

తను ఎంత పెద్ద స్టార్ తో సినిమా చేసినా 70 రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తాడు. అయితే కెరియర్ లో ఫస్ట్ టైం విజయ్ దేఅరకొండ సినిమా కోసం 100 రోజుల పైగా షూటింగ్ ఉంటుందని తెలుస్తుంది. మాములుగా హీరో ఎవరైనా సరే తన స్టైల్ ఆఫ్ మేకింగ్ కు అలవాటు చేసే పూరి విజయ్ విషయంలో అతని రూట్ లోకి ఈయన వెళ్లినట్టు ఉన్నాడు. పూరిని కూడా మార్చేసిన క్రెడిట్ విజయ్ దేవరకొండకు దక్కుతుంది. ఈ సినిమాలో మొదట్లో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని అన్నారు. కాని అనన్య పాండేని ఫైనల్ చేశారు.

 

సినిమా టైటిల్ ఫైటర్ అని ప్రచారంలో ఉంది. ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. సినిమాలో విజయ్ స్టైల్ పూరి మార్క్ కనిపించేలా ఉంటుందని తెలుస్తుంది. ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ ఈ వాలెంటైన్స్ డే కి రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. పూరి, విజయ్ సినిమా కూడా ఈ ఇయర్ ఎండింగ్ కు రిలీజ్ చేస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి: