అక్కినేని హీరోల్లో ఒకడైన అఖిల్‌కి ఎందుకోగాని మొద‌టి నుంచి కూడా పెద్ద‌గా క‌లిసిరాలేదు. ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. మొత్తం మూడు చిత్రాల్లో న‌టిస్తే అన్నీ అట్ట‌ర్ ఫ్లాప్‌ల‌గా నిలిచాయి. ప్ర‌స్తుతం ఆయ‌న బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అయితే ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ఖ‌రారు చేయలేదు. ఈ రోజు సాయంత్రం 5 గంటల 15 నిముషాలకు టైటిల్ రివీల్ చేయనున్నామని చిత్ర‌ యూనిట్ నిన్న ప్రకటించింది. అయితే ఈ సినిమాకు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కాని మ‌రి కొంత మంది ఈ టైటిల్ తెలుగులోనే ఉండబోతుంద‌ని కామెంట్లు పెడుతున్నారు. 

 

ఈ చిత్రం చివ‌రి షెడ్యూల్‌లో చిత్ర బృందం ఓ రొమాంటిక్ పాట‌ను పెట్ట‌నున్నార‌ని అలాగే అఖిల్‌- పూజా ల మ‌ధ్య కెమిస్ట్రీ బాగా వ‌ర్క్ అవుట్ అయ్యేలా కొన్ని సీన్లను కాస్త ఘాటుగా తెర‌కెక్కించారిన స‌మాచారం. మ‌రి అయితే ప్ర‌స్తుతం ఎక్కువ‌గా అలాంటి వాటిపైన జ‌నాలు కూడా ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో ల‌వ్ సీన్స్ బాగా హైలెట్‌గా నిలిచేలా ఉన్నాయి. ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా చూపించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది.

 

మ‌రి ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతుంది. దేవిశ్రీ మ్యూజిక్‌, భాస్క‌ర్ డైరెక్ష‌న్ ఈ సినిమాను  ఏ మాత్రం నిల‌బెడ‌తాయో చూడాలి. అలాగే అఖిల్ కెరియ‌ర్‌లో ఇది భారీ విజ‌యం కావాల‌ని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఏం జ‌రుగుద్దో తెర మీద చూస్తే గాని చెప్ప‌లేం. `మిస్ట‌ర్ మ‌జ్ను`కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది అక్కినేని అఖిల్ కి. మ‌రి ఇప్పుడు ఈ చిత్రానికి చాలా జాగ్ర‌త్త‌లే తీసుకుంటున్నాడు ఈ హీరో. అలాగే నాగార్జున కూడా చిత్రం గురించి చాలా కేర్ తీసుకుంటున్న‌ట్లు కొడుకు విష‌యంలో కాస్త టెన్ష‌న్ కూడా ప‌డుతున్న‌ట్లు సమాచారం. మ‌రి అర‌వింద్ చేతిలో ప‌డ్డాడు కాబ‌ట్టి చెప్ప‌లేం క‌నీసం ఆ బ్యాన‌ర్ ఏమ‌న్నా క‌లిసొస్తుందోమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: