మొన్న రాత్రి అల్లు అర్జున్ ఒక ప్రముఖ హోటల్ లో ఇచ్చిన పార్టీకి చిరంజీవి డుమ్మా కొట్టాడు అన్న వార్తలు వస్తున్నాయి. ‘అల’ సూపర్ సక్సస్ తో జోష్ లో ఉన్న బన్నీ మెగా ఫ్యామిలీ లోని హీరోలు అందర్నీ ఈ పార్టీకి పిలవడంతో పాటు చిరంజీవిని వ్యక్తిగతంగా కలిసి ఈ పార్టీకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. 

కొరటాల దర్శకత్వంలో తాను నటిస్తున్న మూవీ షూటింగ్ వంక చెప్పి చిరంజీవి ఈ పార్టీకి డుమ్మా కొట్టాడు అంటూ గాసిప్పులు వస్తున్నాయి. వాస్తవానికి ‘అల’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో బన్నీ ఓపెన్ గా మాట్లాడుతూ తన కట్టె కాలే వరకు తాను చిరంజీవి అభిమానిగానే కొనసాగుతాను అని ఓపెన్ గా చెప్పి తన మామయ్య పై తనకున్న భక్తిని గౌరవాన్ని చాటుకున్నాడు. 

ఈ సంఘటన జరిగి కొన్ని వారాలు కూడ అవ్వకుండానే ఇప్పుడు చిరంజీవి పెద్ద మనసు చేసుకుని బన్నీ పార్టీకి ఎందుకు వెళ్ళలేదు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా మెగా కాంపౌండ్ నుండి కూడ మిగతా హీరోలలో ఎవరు ఈ పార్టీకి రాలేదు అని తెలుస్తోంది. ఈ పార్టీకి బన్నీ స్వయంగా అనేకమంది హీరోలకు ఫోన్ చేసి పిలిచినా చాలామంది రకరకాల కారణాలు చెప్పి బన్నీకి కోపం రాకుండా ప్రవర్తించి ఈ పార్టీకి దూరంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే ఈ పార్టీకి ఈ మూవీ బయ్యర్లతో పాటు అనేకమంది మీడియా వర్గాలు రావడంతో వారందరికీ మెమంటోలు ఇచ్చి బన్నీ హడావిడి చేసినట్లు టాక్. ప్రస్తుతం ఈ వార్తలు ఇలా వైరల్ అవ్వడంతో ‘అల వైకుంటపురములో’ సక్సస్ ను ఇండస్ట్రీలోని అన్ని వర్గాలు పూర్తిగా గుర్తించడం లేదా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిన్నటి రోజున వర్కింగ్ డే అయినప్పటికీ తెలుగు రాష్ట్రాలలో ‘అల’ మూవీ కలక్షన్స్ స్థిరంగా కొనసాగుతూ ఉండటంతో ఈ మూవీ ఫైనల్ కలక్షన్స్ ఏ రేంజ్ కి చేరతాయి అంటూ చాలామంది ఆశ్చర్య పడుతున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: