పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమాలు అన్నింటిలోను పవన్ తో అలీ కలిసి నటించాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే హాస్య సన్నివేశాలు ఆ సినిమాల హిట్ కు ఎంతగానో సహకరించాయి. అయితే పవన్ రాజకీయాలలోకి వచ్చిన తరువాత అలీ పవన్ వెంట నడవకుండా వేరే పార్టీలలో చేరి ఆ పార్టీల గెలుపు కోసం తన వంతుప్రయత్నం చేసాడు. 

అయితే ఈ విషయాలు ఏమి పట్టించుకోకుండా తన కెరియర్ రీ ఎంట్రీ మూవీ ‘పింక్’ విజయానికి అలీ సహకారం కూడ అవసరం అని భావించిన పవన్ అలీకి స్వయంగా ఫోన్ చేసి తాను నటిస్తున్న ఈ మూవీలో ఒక కీలక పాత్రను చేయమని అడిగినట్లు టాక్. పవన్ నుండి వచ్చిన ఊహించని ఆహ్వానానికి జోష్ లోకి వెళ్ళిపోయిన అలీ వెంటనే తాను నటిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ‘పింక్’ కథలో చాల మార్పులు చేసినట్లు స్వయంగా దిల్ రాజ్ లీకులు ఇస్తున్నాడు. దీనితో ఈ మూవీలో అలీ ఎలాంటి పాత్ర చేయబోతున్నాడు అన్న ఆసక్తి పెరుగుతోంది. ఈ మూవీలో ఇగో ఎక్కువగా ఉండే లాయర్ పాత్రలో పవన్ కనిపించే విధంగా మార్పులు చేసినట్లు సమాచారం. 

దీనికితోడు ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో పవన్ గెడ్డం తో మరికొన్ని సీన్స్ లో గెడ్డం లేకుండా క్లీన్ షేవ్ అవతారంలో కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలోని పాటలు కూడ పవన్ భావజాలానికి అనుగుణంగా ఉండే విధంగా ప్రత్యేకంగా వ్రాయించి తమన్ చేత స్వర పరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ పాటల విషయంలో కూడ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఈ రీమేక్ లో ఏ ఒక్క చిన్న పొరపాటు జరగకుండా దిల్ రాజ్ అన్ని వ్యవహారాలూ స్వయంగా తానే చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. పవన్ కెరియర్ ను ఒక మలుపు తిప్పిన ‘గబ్బర్ సింగ్’ విడుదలైన మే నెలలో అదే సెంటిమెంట్ ను నమ్ముకుని ఈ మూవీ విడుదల కాబోతోంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: