తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు చెబితే తమిళనాడులో కలెక్షన్ల మోత మోగుతుంది. ఆయన సినిమాలకు ఉన్న క్రేజ్ అలాంటింది. రజినీకాంత్ రీసెంట్ మూవీ దర్బార్ ఇటివలే సంక్రాంతికి దేశవ్యాప్తంగా విడుదలైంది. అయితే.. సినిమా అంచనాలు అందుకోలేక పోయింది. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోలేక పోయింది. కలెక్షన్లు వచ్చినా సినిమా బిజినెస్ కు రజినీ క్రేజ్ కు ఏమాత్రం సరిపోలక ఫ్లాప్ గా మిగిలిపోయింది. కధపై కాకుండా కేవలం రజినీ మేనరిజమ్స్ పై ఆధారపడటమే పెద్ద మైనస్ గా చెప్పాలి.

 

 

ఇప్పుడు ఈ సినిమాను కొనుక్కున్న అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్స్ తీవ్ర నష్టాల్లో ఇరుక్కుపోయారు. ప్రతి ఏరియాలో కూడా సినిమాకు నష్టాలు తప్పలేదు. దీంతో చెన్నైలో రజినీ ఇంటికి వారందరూ క్యూ కట్టారట. నష్టాల నుంచి గట్టెక్కాలంటే రజినీ ఆదుకోవాలని ఆయన్ను కలవటానికి వెళ్లారట. కానీ రజినీ వారెవరినీ కలవలేదు అని కోలీవుడ్ సమాచారం. లైకా ప్రొడక్షన్స్ కూడా దాదాపు 50కోట్ల లాస్ లో ఉండిపోయిందని కూడా ఓ వార్త కోలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. దీంతో వారికి రజినీనే దిక్కులా మారాడు. కానీ రజినీ వారిని ఆదుకునేలా కనబడటం లేదు. బాబా సినిమాకు లాస్ కవర్ చేసిన రజినీ తర్వాత ఇలా ఆదుకున్న సందర్భాలు లేవనే చెప్పాలి.

 

 

చెప్పాలంటే 2010లో వచ్చిన రోబో సినిమా తర్వాత రజినీ చేసిన కొచ్చాడయాన్, లింగా, కబాలి, కాలా, రోబో 2.0, పెట్టా.. ఇవన్నీ ఫ్లాప్ వెంచర్లు గానే మిగిలి భారీ నష్టాలను మిగిల్చాయి. ఇప్పుడు దర్బార్ కూడా ఆ లిస్టులో చేరిపోయింది. రజినీ మ్యానియా ఈమధ్య పనిచేయడం లేదని ఈ సినిమాల ద్వారా తెలుస్తోంది. మరి.. శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: