ఈ మద్య వరుసగా బయోపిక్ సినిమాలు వస్తున్నాయి..ఇదే క్రమంలో చారిత్రక నేపథ్యంలో కొన్ని సినిమాలు తెరకెక్కడం..సూపర్ హిట్ కావడం జరుగుతుంది.  ఈ నేపథ్యంలో పద్మావత్, మణికర్ణిక మంచి విజయాలుఅందుకున్నాయి.   ఈ నేపథ్యంలో బాలీవుడ్  స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తానాజీ’. 17వ శతాబ్దంలో మరాఠా సామ్రాజ్యాన్ని ఏలిన ఛత్రపతి శివాజీ మహారాజ్.. దగ్గర సుబేదార్‌గా పనిచేసి ఆయన ఎన్నో విజయాల్లో కీలక భూమిక పోషించిన  తానాజీ‌ జీవిత చరిత్ర ఆధారంగా అదే  ‘తానాజీ’ టైటిల్‌తో దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించాడు. ఒక యుద్ధం గురించి తెలుసుకోవాలి అంటే కేవలం గెలిచినా వాళ్ళు, ఓడిపోయిన వాళ్ల గురించి మాత్రమే మాత్రమే కాదు.. ఆ యుద్ధాన్ని గెలిచేలా చేసిన యోధుల గురించి కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి.  

 

ఒక యుద్ధానికి వెళ్ళాలంటే సైన్యం, ఆయుధాలు సమృద్ధిగా ఉంటె ఎవరైనా అడుగు ముందుకు వేస్తారు.  అతి తక్కువ సైన్యంతో.. సైన్యంతో అసలు ప్రవేశించడం కూడా వీలు శత్రు దుర్భేధ్యమైన కోటను అది కూడా వేలమంది సైన్యంతో పోరాడి, గెలిచి అమరుడైన ఒక మహాయోధుడి కథ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆ వీరుడే సుబేదార్ తానాజీ మాల్సారి. సంక్రాంతి కానుకగా.. జనవరి 10న విడుదలైన ఈ మూవీ.. ఇప్పటికీ రూ.250 కోట్లు వసూళ్లు చేసినట్లు బాలీవుడ్ టాక్.   

 

అజయ్ దేవగణ్ ఈ మూవీలో తన్హాజీ పాత్ర చేయగా హీరోయిన్ కాజోల్ తన్హాజీ భార్య పాత్ర చేశారు. ఈ మూవీలో మరో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు.  రూ.150కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన తన్హాజీ పోటీలో కూడా భారీ వసూళ్లు దక్కించుకుంది.  ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో అజయ్ దేవగాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్నారు. 
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: