సినిమాల్లో సక్సెస్ అవ్వాలంటే అందం ఉండాలి, ఏ సీన్లో అయిన కూడా ఇట్టే ఆకర్షించే విధంగా ఉండాలి.. అప్పుడు వరుస సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.. అందుకే ఇప్పుడు జనాలకు చెమటలు పట్టించేలా హీరోయిన్ ఉంటే అప్పుడు సినిమా అవకాశాలు బాగా వస్తాయి అందుకే సినిమాలలో నటిస్తూ వస్తున్నారు.. మొదటి సినిమా కనుక హిట్ అయితే సినిమాలు ఒక్కటి హిట్ అయితే ఇంక చెప్పాల్సిన పనిలేదు లక్ లక్కపిడతలాగా పట్టుకుంటుంది...

 

 

ప్రస్తుతం తెలుగులో టాప్ హిరోయిన్ గా దూసుకుపోతున్న హిరోయిన్ రష్మీక మాందన్న.. ఇటీవల ఈమె నటించిన సరిలెరూ నికెవ్వారు.. చిత్రం ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే..అయితే ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ వస్తుంది..భీష్మ‌` చిత్రంతో న‌టిస్తోంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకోవ‌డంతో మ‌రో చిత్రానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేసింది.

 

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో స్టైలిష్ స్టార్ బ‌న్నీ ఓ మాస్ మాసాలా ఎంట‌ర్‌టైనర్ చేస్తున్న విష‌యం తెలిసిందే. మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది. త్వ‌ర‌లో రెండ‌వ షెడ్యూల్ న‌ల్ల‌మ‌ల అడ‌వుల్లో లేదా చిత్తూరులో ప్రారంభించ‌బోతున్నారు. ఇందులో బ‌న్నీకి జోడీగా ర‌ష్మిక న‌టిస్తోంది. ఇదిలా వుంటే తెలుగులో స్టార్స్‌ని చుట్టేస్తున్న ర‌ష్మిక త‌మిళంలోనూ మొద‌లుపెట్టేసింది. ఇప్ప‌టికే కార్తితో క‌లిసి ఓ చిత్రంలో న‌టిస్తోంది. భాగ్యరాజ క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి `సుల్తాన్‌`అనే టైటిల్‌ని ఫైన‌ల్ చేశారు.

 

ఈ సినిమాతో పాటు సూర్య‌తో మరో చిత్రాన్ని అంగీక‌రించిన‌ట్టు తెలిసింది. యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య ఓ చిత్రం చేయ‌బోతున్నారు. ఇందులో సూర్య‌కు జోడీగా మాళ‌వికా మోహ‌న‌న్‌ని అనుకున్నారు కానీ విజ‌య్ `మాస్ట‌ర్‌` చిత్రంలో బిజీగా వుండ‌టం వ‌ల్ల ఆ స్థానంలో ర‌ష్మికని తీసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌. ర‌ష్మిక కూడా సూర్య‌తో క‌లిసి న‌టించడానికి అంగీక‌రించ‌డంతో ఒకే సారి అన్నా త‌మ్ముళ్ల‌తో ర‌ఫ్మిక హంగామా చేస్తోంద‌ని కోలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు...మరి ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం తెలియాల్సి ఉంది...

మరింత సమాచారం తెలుసుకోండి: