టాలీవుడ్ లో అవకాశాల కోసం హీరోయిన్లకు పోటీ ఉంటుంది. స్టార్ హీరోయిన్లయితే వారినే వెతుక్కుని అవకాశాలు ఇస్తూంటారు మన మేకర్స్. కాస్త క్రేజ్ తగ్గితే అవకాశాల కోసం ప్రయత్నించాల్సిందే. సీనియారిటీ వచ్చేస్తే ఎవరు అవకాశం ఇస్తారా అని ఎదురు చూడాలి.. లేదంటే పెళ్లి చేసుకుని సెటిలైపోవాలి. ప్రస్తుతం అలా సీనియర్లు అయిపోయిన స్టార్ హీరోయిన్లు కొంతమందికి టాలీవుడ్లో అనుకోని అవకాశాలు దక్కుతున్నాయి. అవి కూడా స్టార్ హీరోల పక్కన మెయిన్ లీడ్ హీరోయిన్ క్యారెక్టర్లే కావడం విశేషం.

 

 

దాదాపు 12 ఏళ్ల పాటు టాలీవుడ్, కోలీవుడ్ ను ఏకకాలంలో స్టార్ హీరోయిన్ గా ఏలేసిన చెన్నై బ్యూటీ త్రిషకు తమిళ్ లో తప్ప కొన్నేళ్లుగా అవకాశాలు లేవు. కానీ అనుకోని విధంగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి పక్కన హీరోయిన్ గా అవకాశం వెతుక్కుంటూ వెళ్లింది. చిరంజీవితో గతంలో త్రిష స్టాలిన్ లో చేసింది. ఇప్పుడు ఆయన 152వ మూవీలో అవకాశం రావడం లక్కీనే. ప్రియమణి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. మంచి నటిగా పేరు తెచ్చుకుని జాతీయ అవార్డు కూడా సాధించింది. ఇప్పుడు వెంకటేశ్ సినిమా నారప్పలో మెయిన్ హీరోయిన్ గా చేస్తోంది. పెళ్లై విడాకులు తీసుకుని మళ్లీ సినిమాల్లో నటిస్తున్న అమలాపాల్ కు కూడా ఈ సినిమాలో అవకాశం దక్కింది.

 

 

తెలుగుతోపాటు తమిళ సినిమాలను వదిలేసిన శృతిహాసన్ కు కూడా ఓ మంచి అవకాశం వచ్చింది. రవితేజ పక్కన క్రాక్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కింది. గోపీచంద్ దర్శకుడు. గతంలో వీరిద్దరూ బలుపు సినిమాలో కలసి నటించారు. ఆ సినిమా హిట్ అయింది. శ్రియకు కూడా తెలుగులో అవకాశాలు వస్తున్నాయని టాలీవుడ్ సమాచారం. ఇలా ఒకప్పటి స్టార్ హీరోయిన్లైన సీనియర్లు మళ్లీ స్టార్ హీరోల పక్కన హీరోయిన్ అవకాశాలు దక్కించుకోవడం విశేషమే.

మరింత సమాచారం తెలుసుకోండి: