పెద్ద సినిమాలో పాట హిట్ అయితే.. నెట్ లో చక్కర్లు కొడుతుంది. గంటలో లక్ష.. రోజుకో 10లక్షల వ్యూస్ వస్తాయి. ఆయా పాటలు సినిమాలపై అంచనాలు పెంచేస్తాయి. అయితే చిన్న పాత్రల్లో పాటలు బాగున్నా పట్టించుకోవడం లేదు. మంచి సాహిత్యం.. వినసొంపైన కంపోజిషన్ ఉన్న ఆ పాట ఏమిటో తెలుసుకుందామా..!

 

చిన్న సినిమాల్లో పాటలు బాగున్నా.. ఆదరణకు నోచుకోవడం లేదు. మిలియన్ వ్యూస్ రాకపోయినా.. సినిమా ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. పూరీ వారసుడు ఆకాశ్ నటిస్తున్న చిత్రం రొమాంటిక్. ట్రాజెడీ సాంగ్ ను మొదటి పాటగా రిలీజ్ చేసినా.. యూత్ ను ఆకట్టుకుంది. భాస్కరభట్ల రాసిన ఈ పాటను సునీల్ కాశ్యప్ గాయం చేయడంతో పాటు.. మ్యూజిక్ అందించారు. 

 

నటీనటులు.. దర్శకులు ఎవరో పెద్దగా తెలియకపోయినా.. రిలీజైన మొదటి పాట సవారి సినిమా సినిమాకు క్రేజ్ తీసుకొచ్చింది. నీ కన్నులో.. అంటూ సాగిన ఈ పాటను కాసర్ల శ్యాం రాయగా.. రాహుల్ ఆలపించాడు. ఈ మధ్యనే రిలీజైన నీలినీలి ఆకాశం.. సాంగ్ ఎక్కువగా వినిపిస్తోంది. యాంకర్ ప్రదీప్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అమ్రిత హీరోయిన్. చంద్రబోస్ కలం వచ్చిన ఈ సాహిత్యం యూత్ నే కాదు అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. ఇలా చిన్న చిత్రాల్లో పాటలు పెద్దగా ఆకట్టుకుంటున్నాయి. 

 

చిన్నసినిమాలు కదా అని చులకనగా తీసిపారేయకూడదని ఈ సినిమాలు నిరూపించాయి. సంగీతం అంటే పడి చచ్చే వాళ్లు చాలామందే ఉంటారు. పాట రాగానే కాళ్లు చేతులు తెగ ఊపేస్తారు. కొందరైతే పూనకంతో ఊగిపోతారు. సంగీతానికి అలాంటి శక్తి ఉంది. మ్యూజిక్ లవర్స్ కొత్త పాటలపై తెగ దృష్టి పెడతారు. అందులో సారాంశం అర్థం కాకపోయినా.. మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తారు. అలాంటి మ్యూజిక్ మసాలా చిన్న సినిమాల్లో మెండుగా ఉంటోంది. ఒక్కోసారి పెద్ద సినిమాలు మ్యూజిక్ పరంగా అట్రాక్ట్ చేయకపోయినా.. చిన్న సినిమాలు ఆ క్రేజ్ ను సొంతం చేసుకుంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: