టాలీవుడ్ టాప్ అండ్ సెన్షేషనల్ డైరెక్టర్ డేరింగ్ అండ్ డాషింగ్ అన్న ట్యాగ్ ఉన్న ఒకే ఒక్క దర్శకుడు పూరి జగన్నాధ్. ఆయన దర్శకత్వంలో సినిమా చేస్తే ఏ హీరోకైనా  విపరీతమైన క్రెడిబులిటీ వస్తుంది. మాస్ ఇమేజ్ వస్తుంది. మార్కెట్ రేంజ్ పెరుగుతుంది. నాకు నేనే పోటి నాకు నాతోనే పోటి అన్న స్టామినా వస్తుంది. దటీజ్ పూరి జగన్నాద్. ఇక పూరి ఏ స్టార్ హీరో తో సినిమా చేసిన అదే స్పీడ్ అదే స్టైల్. పూరి మార్క్ హీరో మీద ఉండాలే గాని హీరో మార్క్ పూరి మీద ఉండదు. బద్రి అన్న ఒక్క సినిమాకే ఇంత దమ్మున్న డైరెక్టర్ ఇన్నాళ్ళు ఎక్కడున్నాడు అంటూ ఇండస్ట్రీ మొత్తం చెప్పుకున్నారు. అంతేకాదు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల దగ్గర్నుంచి, స్టార్ ప్రొడ్యూసర్స్ వరకు అందరూ పూరి గురించి ఎంక్వైరీ మొదలు పెట్టారు. మాసీగా చెపాలంటే ఆయన మీద కర్చీఫ్ ల మీద కర్చీఫ్ లు వేశారు. కేవలం ఒక్క బద్రి సినిమాతో వచ్చిన క్రేజ్ ఇదంతా. 

 

ఇక ఆ తర్వాత వచ్చిన ఇడియట్, అమ్మా నాన్నతమిళ అమ్మాయి పూరి ని ఎక్కడికో తీసుకు వెళ్ళింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో తిసిన పోకిరి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్స్ ని దక్కించుకుంది. అసలు మహేష్ లో ఈ రేంజ్ మాస్ యాంగిల్ ఉందా అన్న అనుమానాలు కలిగేలా చేశారు పూరి. కొత్త మేకోవర్, కొత్త బాడీ లాంగ్వేజ్, కొత్త డైలాగ్ డెలివరీ తో మహేష్ ని అకాశంలో నిలబెట్టారు. తారక్ లోను అప్పటి వరకు ఉన్న మాస్ ఇమేజ్ ని అమాతం పెంచేసిన సినిమా టెంపర్. ఒక్క క్లైమాక్స్ కోర్ట్ సీన్స్ తారక్ లైఫ్ లో గాని జనాలకి గాని అలా గుర్తుండి పోవాల్సిందే.

 

ఇంత మందితో ఇన్ని బ్లాక్ బస్టర్స్ తీసిన పూరి కి మాత్రం మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చినట్టే వచ్చి జారిపోయింది. ఆటో జాని టైటిల్ తో మెగాస్టార్ ని అద్భుతంగా చూపించాలనుకున్నారు పూరి. కాని ఆ ఛాన్స్ మిస్సయ్యింది.  అయితే ఈ సారి మాత్రం అలా మిస్సయ్యో ఛాన్స్ లేదని పూరి కాన్‌ఫిడెంట్ గా ఉన్నాడట. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చి మళ్ళీ సినిమాలు చేయడం మొదలు పెట్టడంతో పూరి పవర్ స్టార్ తో హ్యాట్రిక్ హిట్ కోసం సిద్దంగా ఉన్నాడని తాజా సమాచారం. అన్ని కుదిరితే 2021 లో ఈ సినిమా ఉండొచ్చునని అంటున్నారు. అంతే కాదు అదే 2021 లో మెగాస్టార్ తో కూడా సినిమా ఓకే అయితే బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ప్లాన్ చేసుకొని ఉన్నాడట. ఇక మెగా ఫ్యాన్స్ అదిరిపోయో న్యూస్ ఏంటంటే ఒప్పుకోవాలే గాని మెగాస్టార్, పవర్ స్టార్ లతో పాన్ ఇండియారేంజ్ మల్టీ స్టారర్ ని తీయడానికి కూడా పూరి రెడీ అయ్యారట. ఆల్రెడీ పూరి స్టామినా తెలుసు కాబట్టి త్వరలో ఈ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: