మెగాస్టార్ జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం ఖైదీ. 28 అక్టోబర్ 1983 లో విడుదలైన ఈ సినిమా చిరంజీవిని అగ్రనటునిగా, కోదండరామిరెడ్డిని గురువుకి తగ్గ శిష్యునిగా, పరుచూరి బ్రదర్స్ ను ప్రముఖ రచయితలుగా నిలిపిన చిత్రంగా చెప్పవచ్చూ. నాటి కాలంలో రికార్డ్‌లను సృష్టించిన ఈ సినిమా కన్నడంలో విష్ణువర్ధన్ హీరోగా, హిందీలో జితెంద్ర హీరోగా నిర్మించబడింది...  

 

 

ఇక 36 సంవత్సరాల తర్వాత ఈ సినిమా టైటిల్‌ను కార్తీ పట్టేసాడు. హీరో కార్తీ, ప్రముఖ నటుడు సూర్య తమ్ముడు. పదేళ్ల కింద యుగానికి ఒక్కడు సినిమాతో తెలుగులో మార్కెట్ సొంతం చేసుకున్న కార్తీ. ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తున్నాడు. ఆయన సినిమాలు వరుసగా తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలవుతుంటాయి. ఇదిలా ఉండగా ఈ ఖైదీ అనే సినిమా టైటిల్ నిర్మాతలకు కనక వర్షం కురిపిస్తుండటం విశేషం.. ఇక గత ఏడాది తమిళంలో కార్తీ హీరోగా కేవలం ఒక్క రాత్రిలో జరిగే కథగా ఈ సినిమాను తెరకెక్కించిన విధానం అందరికీ నచ్చడంతో ఈ సినిమా సూపర్ సక్సెస్‌గా నిలిచింది..

 

 

 

లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్స్‌కు నిజంగానే కాసుల వర్షం కురిపించింది. నాటి నుండి నేటి వరకు వెండితెర రంగులు మారుతున్నాయి గాని ఈ సినిమా కలెక్షన్స్‌లో,  ప్రేక్షకులు ఆదరించడంలో ఏ మాత్రం మార్పు లేదు.. ఖైదీ టైటిల్‌కు అందరు ఖైదీలుగా మారి మంచి విజయాన్ని అందిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలైయ్యాయి. ఇక ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ చిత్ర నిర్మాణ హక్కులను కైవసం చేసుకుందని సమాచారం. కాగా అధికారికంగా ఈ సినిమాలో నటీనటులు ఎవరనే అంశాలను మాత్రం ప్రకటించలేదు. కానీ ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ నటించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది..

 

 

ఇక తమిళంతో పాటు తెలుగులోనూ కార్తీకి అదిరిపోయే హిట్‌ను అందించిన ఖైదీ, ఇప్పుడు బాలీవుడ్ జనాలను అలరించేందుకు  బాష మారుతున్నాడు.. మరి అక్కడ ఖైదీ ఎలాంటి హిట్ కొడతాడా అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిందట.. ఇకపోతే అప్పుడు చిరంజీవి. ఇప్పుడు కార్తీ.. రేపు ఎవరో ఈ చిత్రంలో హీరోగా నటించేది అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: