యంగ్ హీరో శర్వానంద్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకుండా తప్పించు తిరగడం వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. మరో రెండు రోజులలో విడుదల కాబోతున్న ‘జాను’ ప్రమోషన్ నిమిత్తం అనేక ప్రముఖ పత్రికలు శర్వానంద్ ఇంటర్వ్యూ కోసం ప్రయత్నాలు చేస్తున్నా శర్వా ఆ విషయాలను పట్టించుకోకుండా కేవలం బుల్లితెర పై ప్రసారం అయ్యే ఇంటర్వ్యూలలో మాత్రమే ఈ యంగ్ హీరో కనిపిస్తున్న పరిస్థితులలో ‘జాను’ పై శర్వానంద్ కు నమ్మకం లేదా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 

వాస్తవానికి శర్వానంద్ కు ఈ రీమేక్ లో నటించడం పెద్దగా ఇష్టం లేదు అని అంటారు. అయితే దిల్ రాజ్ బలవంతం పై ఈ మూవీలో శర్వానంద్ నటించాడు అన్న వార్తలు ఉన్నాయి. దీనికితోడు హీరో నానిమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అతిధిగా వచ్చి ‘96’ రీమేక్ తెలుగు ప్రేక్షకులకు నచ్చదని అయితే ఈ మూవీలో సమంత శర్వానంద్ లు కలిసి నటిస్తున్నారు కాబట్టి ఈ మూవీ హిట్ అవుతుంది అంటూ కామెంట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు శర్వానంద్ అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చే విషయంలో వెనకడుగు వేయడం వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ ప్రస్తుతం గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే శర్వానంద్ గతంలో నటించిన ‘పడి పడి లేచే మనసు’ ‘రణరంగం’ మూవీలను చాల విపరీతంగా శర్వానంద్ వాటి విడుదల ముందు ప్రమోట్ చేసాడు. 

అయితే ఆ రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో షాక్ అయిన శర్వానంద్ ఇలా ప్రవర్తిస్తున్నాడా లేకుంటే ‘జాను’ పై శర్వానంద్ కు ఇప్పటికే ఆశలు  వదలుకున్నాడా అంటూ కామెంట్ చేస్తున్నారు. దీనికితోడు శర్వానంద్ వ్యూహాత్మకంగా ఈ సినిమాను సమంత నటన కోసం చూడండి అని అంటున్న పరిస్థితులలో ఈ మూవీ హిట్ అయితే తన ఖాతాలోకి తీసుకోవడానికి ఒక వేళ ఫెయిల్ అయితే ఆ విషయాన్ని దిల్ రాజ్ తప్పుడు నిర్ణయం పై తోసి వేయడానికి ఇప్పటికే శర్వానంద్ ఫిక్స్ అయ్యాడా అంటూ కామెంట్స్ వస్తున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: