మాస్ రాజా రవితేజ ,యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ క్రాక్.  యాక్షన్ ఎంటర్ టైనర్ గా  రానున్న ఈ చిత్రంలో  రవితేజ  తనకు బాగా కలిసొచ్చిన పోలీస్ ఆఫీసర్  పాత్రలో కనిపించనున్నాడు.  ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుండి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండంతో  ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. 
 
ఇక  ఇటీవల  ఈసినిమా నుండి  రవితేజ, శృతిహాసన్ ల ఫస్ట్ లుక్ లు విడుదలకాగా తాజాగా  ఈరోజు రవితేజ కు సంబందించిన మరో లుక్ ను విడుదలచేశారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో  సముద్రఖని , వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో  కనిపించనుండగా ఠాగూర్ మధు  నిర్మిస్తున్నాడు.  మే 8న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.  ఇక రవితేజ-గోపిచంద్ కలయికలో ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన డాన్ శీను యావరేజ్  అనిపించుకోగా బలుపు సూపర్ హిట్ అయ్యింది.
 
ఇదిలా ఉంటే గత ఏడాది  హ్యాట్రిక్ డిజాస్టర్ల తరువాత  ఇటీవల  డిస్కోరాజా  తో  వచ్చిన  రవితేజ కు ఈ సినిమా కూడా  భారీ షాక్ ఇచ్చింది. గత మూడు సినిమాలకు  ఏ మాత్రం  తీసిపోకుండా   పూర్ టాక్ తో డిస్కోరాజా  డిజాస్టర్  ఫలితాన్ని రాబట్టింది.  సైన్టిఫిక్ థ్రిల్లర్ గా ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేమ్  వి ఐ ఆనంద్  తెరకెక్కిన ఈచిత్రం పూర్తిగా నిరాశపరిచింది. మరి రవితేజ క్రాక్ తోనైనా  హిట్టు కొట్టి మళ్ళీ ట్రాక్ లో పడతాడో లేదో చూడాలి. ఈసినిమా తరువాత రవితేజ,  వీర ఫేమ్ రమేష్ వర్మ  డైరెక్షన్ లో నటించనున్నాడు. ఏప్రిల్ నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: