ఈ కాలం టాటూ కాలం.. అవును. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు పచ్చబొట్టు పొడిపించుకునే వారు.. చేతులపై ముగ్గులు వేయించుకునేవారు. భక్తి ఉన్నవారు కుడి చేతిపై దేవుడు టాటూ వేయించుకునే వారు. అయితే ఇప్పుడు అదే పచ్చ బొట్టును టాటూ అని ఇంగ్లిష్ లో స్టైల్ గా పిలుస్తున్నారు. అయితే ఇంకా ఆ టాటూని సెలబ్రెటీలు బాగా వేయించుకుంటున్నారు.  

 

వాళ్ళకు నచ్చినట్టు.. నచ్చిన బొమ్మలను.. పేర్లను.. అన్నింటిని వారు టాటూలు వేయించుకొని తిరుగుతున్నారు. ఇప్పటికే త్రిష, సమంత, రోజా, శృతిహాసన్, తమన్నా ఇలా అందరూ టాటూలు వేయించేసుకున్నారు. కానీ అందరూ కూడా ఏవో చిన్న చిన్న పేర్లు, వారికీ నచ్చిన డిజైన్లు వేయించుకున్నారు. 

 

కానీ ఓ హీరోయిన్ మాత్రం దేవుడికి సంబంధించిన డిజైన్ సీక్రెట్ ప్లేస్ లో వేయించుకొని అవమానాలపాలైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ పూనమ్ కౌర్ ఏ ఈ పని చేసింది. ఆమె ఓ సీక్రెట్ ప్లేస్ లో శివుడు టాటూ వేయించుకుంది. ఆ టాటూని నిన్న రివీల్ చేసింది. ఆమె రివీల్ చెయ్యడం ఆలస్యం విమర్శల పాలైంది. 

 

ఎంతో ఆనందంగా టాటూని రివీల్ చేసిన ఈ భామ చివరికి విమర్శలకు గురైంది.. ఆ టాటూని చుసిన నెటిజన్లు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు బుద్ధి ఉందా? అలాంటి చోటా దేవుడి టాటూ వేయించుకుంటావా? అని ఒకరు కామెంట్ చేస్తూ.. మరొకరు కామెంట్ చేస్తూ.. అందులో తప్పు ఏముంది.. అది ఎం భక్తి అని ఒకరు అన్నారు. పూనమ్ అయితే ప్రస్తుతం ఈ కామెంట్లపై స్పందించలేదు కానీ ఒకవేళ స్పందిస్తే ఎలా స్పందిస్తుందో చూడాలి. మరి పూనమ్ కౌర్ టాటూపై మీ కామెంట్ ఏంటి?

 

మరింత సమాచారం తెలుసుకోండి: