పవన్ కల్యాణ్ సినిమాల్లో ఉన్న స్థాయి ఏంటో ఆయన ఫ్యాన్ బేస్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలిసిన విషయమే. ఆయన సినిమా ఒప్పుకుంటే ఫ్యాన్స్ కు పండగ. ఆయన సినిమా చేసే బిజినెస్ ఓపెనింగ్ కలెక్షన్లు ఎప్పుడూ చర్చనీయాంశమే. అయితే.. పవన్ రాజకీయాల్లోకి వెళ్లి వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేశాడు. కానీ.. అందరినీ ఆనందంలో ముంచెత్తుతూ మళ్లీ వరుస సినిమాలు సైన్ చేయడంతో అన్ని వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

 

 

అయితే ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే ఈ మూడు సినిమాలకు పవన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ చర్చనీయాంశమవుతోంది. ఈ మూడు ప్రాజెక్టులకు పవన్ 100 కోట్లు తీసుకుంటున్నట్టు వినికిడి. పింక్ రీమేక్ కు 40కోట్లు, మిగిలిన రెండు సినిమాలకు చెరి 30కోట్లు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే కాకుండా ఈ సినిమాల ప్రాఫిట్స్ లో వాటాలు కూడా అందనున్నాయట. పవన్ క్రేజ్ ఏంటో.. ఆయన సినిమాలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ ఫిగర్లే ఓ ఉదాహరణ అని ఫిలిం సర్కిల్స్ లో, ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకున్న పింక్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఉదయం షూటింగ్ సాయంత్రం పాలిటిక్స్ అన్నట్టుగా కష్టపడుతున్నాడు. దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

 

 

రీసెంట్ గా క్రిష్ దర్శకత్వంలో కూడా సినిమా ప్రారంభమైందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే పవన్సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తున్నాడు. దీని తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారధ్యంలో ఓ సినిమా కూడా ప్రారంభమవుతుందని క్లారిటీ వచ్చింది. హరీశ్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. పింక్ రీమేక్ మే 15న రిలీజ్ అని వార్తలు వస్తున్నాయి. క్రిష్ దర్శకత్వంలో సినిమా వచ్చే ఏడాది ఉండొచ్చని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: