పవన్ కళ్యాణ్ ఇప్పుడు రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తున్నాడు. అటు రాజకీయాల్లో బిజీగా గడుపుతూనే , సినిమాలు చేసుకుంటున్నాడు. ఈ ఏడాది ఏకంగా నాలుగు సినిమాలకి ముహూర్తం పెట్టేశాడు. అయితే మొదటి సినిమాగా బాలీవుడ్ పింక్ రీమేక్ తెరెకెక్కుతున్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తాప్సీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం అక్కడ మంచి విజయం సాధించింది.

 

 

ఇప్పుడు అదే సినిమాని తెలుగులో పవన్ ప్రధాన పాత్రలో ఎమ్ సీ ఏ ఫేమ్ వేణు శ్రీరామ్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా యాభై కోట్ల వరకి పారితోషికం తీసుకుంటున్నాడట. ఈ సినిమా చిత్రీకరణలో ఎక్కువ భాగం సుమారు 75 శాతం పవన్ రెమ్యునరేషన్ కే పోతుందట. అంత మొత్తం రెమ్యునరేషన్ కే పోతే సినిమాలో ఎంతలో పూర్తవుతుందని అందరి సందేహం..

 

 

అయితే ఈ సినిమాని హిందీలో కేవలం 23 కోట్లకే నిర్మించారట. అమితాబ్ బచ్చన్ ఇంకా ఇతర పాత్రల పారితోషికాలన్నీ కలిపి అంతే బడ్జెట్ అయిందట. ఇదే సినిమాని తమిళంలో రీమేక్ చేస్తే అక్కడ అజిత్ పారితోషికం మినహా 25 కోట్లలో పూర్తయిందట. ఇప్పుడు తెలుగులో పవన్ రెమ్యునరేషన్ ని కలుపుకుని మొత్తం డెభ్భై ఐదు కోట్లకి మించకుండా చూస్తారట. సినిమాలో ఎక్కువ భాగం కోర్ట్ రూంలోనే జరుగుతుంది కాబట్టి తక్కువ బడ్జెట్ లో సినిమాని పూర్తు చేయవచ్చట.


డెభ్భై ఐదు కోట్లతో పూర్తి చేసిన సినిమాని దిల్ రాజు థియేట్రికల్ రైట్స్ రూపంలో వంద కోట్లకి అమ్ముతాడని మాట్లాడుకుంటున్నారు. దాంతో నిర్మాతలకు ఈజీగా పాతిక కోట్ల వరకు లాభాలు రావడం ఖాయం అంటున్నారు. సినిమా సక్సెస్ అయితే వచ్చే కలెక్షన్స్ అదనంగా చెప్పుకోవచ్చు.  కనుక లాయర్ సాబ్ చిత్రంతో దిల్ రాజుకు ఖచ్చితంగా 15 నుండి 20 కోట్ల వరకు ఫ్రాఫిట్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: