సూపర్ స్టార్ మహేశ్ డేట్స్ ఇస్తే బాగుండను అనుకునే నిర్మాతలెందరో టాలీవుడ్ లో ఉన్నారు. అలా ఎవరికైనా మహేశ్ అవకాశమిస్తే హ్యాపీగా ఫీలై సినిమాలు తీస్తారు. అలాంటిది ఓ బడా నిర్మాత మాత్రం మహేశ్ తో సినిమా అంటే బెంబెలెత్తిపోతున్నాడట. బాబుతో సినిమానా.. వద్దులే బాబూ మీకో దండం అంటూ తప్పుకుంటున్నాడట. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిని ఈ వార్త ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

 

 

మహేశ్ తో పలు సినిమాలు తీసిన ఆ నిర్మాత లెక్కలు తేల్చుకోలేక ఇబ్బందులు పడుతున్నాడట. సినిమాకు ముందే బాబు క్రేజ్ చూసి చేసుకున్న ఒప్పందాలకు.. సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే లాభాలకు పొంతన లేకపోవడం సదరు నిర్మాతకు తలనొప్పిగా మారుతోందట. ఆయా ఒప్పందాలు లేకపోతే బాబు చేయడు.. చేస్తే లాభాలు రావటం లేదు. కానీ.. ఒప్పందం ప్రకారం హామీలన్నీ తీర్చేసరికి ఆ బడా నిర్మాతకు తల బొప్పి కడుతుందట. జాయింట్ వెంచర్ గా చేసినా.. సోలోగా చేసినా కుదుర్చుకునే ఒప్పందాలకు.. వచ్చే లాభాలకు సరిపోలడం లేదని ఆయన తన సన్నిహితుల దగ్గర వాపోతున్నాడని అంటున్నారు. పైపెచ్చు నాన్ ధియటరికల్ షేర్ అడగటంతో లాభాలు కూడా రావటం లేదట. సినిమా హిట్ అయితేనే తీర్చలేని కోరికలు ఇక ఫ్లాప్ అయితే ఆస్తులు అమ్మి తీర్చాల్సిందేనని ఆ అగ్ర నిర్మాత భయపడిపోతున్నాడని సమాచారం.

 

 

ఎంత స్టార్ హీరోలయినా టాక్ ఏమాత్రం తేడాగా వచ్చినా సినిమా రిలీజ్ రోజు సాయంత్రానికే ఎఫెక్ట్ పడిపోతోంది. మూడు రోజుల్లో సర్దేసుకోవడంతోనే నిర్మాతల పని అయిపోతోంది. అలాంటిది భారీ పెట్టుబడులే కాకుండా భారీ అప్పగింతలు కూడా తోడైతే ఏ నిర్మాతకైనా చుక్కలు కనిపిస్తాయి. ప్రస్తుతం ఆ అగ్ర నిర్మాత పరిస్థితిలానే తయారైందంటున్నారు. అందుకే మహేశ్ తో సినిమా అంటే తప్పుంచుకుంటున్నాడట ఆ భారీ నిర్మాత.

మరింత సమాచారం తెలుసుకోండి: