తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి వంశానికి ఓ ప్రత్యేకత ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి నేటి కల్యాణ్ రామ్ వరకూ తమ నటనాకౌశలంతో అఖిలాంధ్ర ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ కు వారసుడిగా బాలకృష్ణ మాత్రమే సినిమాల్లో రాణించినా తండ్రి వారసత్వాన్ని బాలకృష్ణ ఘనంగానే చాటారు. ఎనభయ్యో దశకం నుంచీ ఇప్పటివరకూ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలోని టాప్ 4లో ఒకడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. బలమైన పాత్రలను చాలెంజింగ్ గా చేస్తూ నందమూరి అభిమానులను అలరిస్తున్నారు.

 

 

తరం మారుతుండటంతో బాలకృష్ణ వారసుడిగా ఆయన తనయుడు నందమూరి మోక్షజ్ఞను వెండితెర మీదకు తీసుకురావాలనేది బాలయ్య ఆలోచన. ప్రస్తుతానికి చదువు పూర్తయ్యే దశలో ఉన్న మోక్షజ్ఞ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని బాలయ్య అంటున్నారు. అభిమానుల ఎదురుచూపులు కూడా ఓ స్థాయిలో ఉన్నాయి. ఎపుడెప్పుడు తమ అభిమాన హీరో కుమారుడిని హీరోగా చూస్తామనే ఉత్సాహం వారిలో ఉంది. మోక్షజ్ఞను సినిమాల్లోకి తీసుకొచ్చి తాను నటన నుంచి విరమించుకోవాలని చూస్తున్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న బాలయ్య ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం హిందూపురం అభివృద్ధిపై దృష్టి సారిస్తూ వరుసగా సినిమాలు చేస్తున్నారు.

 

 

ఇదే మరికొన్నేళ్లు సినిమాలు చేసి తనయుడిని పరిచయం చేశాక పూర్తిస్థాయి రాజకీయాల్లో కొనసాగాలనేది బాలకృష్ణ ఆలోచనగా ఉందని సమాచారం. మోక్షజ్ఞకు నటనలో శిక్షణ ఇప్పించి పూర్తిస్థాయి నటుడిగా రాణించేలా చేయాలనేది బాలయ్య ఆలోచన. గతంలో హీరో కృష్ణ కూడా మహేశ్ హీరోగా సెటిల్ అయ్యేవరకూ హీరోగా అనేక సినిమాలు చేశారు. మహేశ్ పుంజుకోగానే ఆయన సినిమాలకు స్వస్తి పలికేశారు. దీంతో కృష్ణ వారసత్వాన్ని మహేశ్ ఘనంగా చాటినట్టైంది. ఇదే తరహాలో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చే వరకూ బాలయ్య సినిమాలు చేసి తర్వాత పూర్తిస్థాయి రాజకీయాలకే పరిమితం అవుతారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: