ఎక్కడైనా వార్తల్లో ప్రముఖంగా నిలిచేది ఒకటి రాజకీయం అయితే రెండోది సినిమా. ఈ రెండే ప్రజలకు కావాల్సిన టాపిక్స్ ను అందిస్తూంటాయి. రాజకీయ నాయకులకు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండాలి. సినిమా వాళ్లకు పరోక్ష సంబంధాలున్నా రాజకీయ నాయకుల కంటే ఎక్కువ ప్రాధాన్యం కలిగి ఉంటారు. అందుకే ఇటు రాజకీయ నాయకులు.. అటు సినిమా రంగంలోని వారు పరస్పర పరిచయాలు కలిగి ఉంటారు. అయితే రాజకీయాలు ప్రతి ఐదేళ్లకూ మారిపోతూ ఉంటాయి. దీంతో సినిమా వాళ్లకు ఎవరు అధికారంలోకి వస్తే వారితో కలిసి మెలిసి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది.

 

 

దీంతో సినిమా వారంతా అప్పటికి అధికారంలో ఉన్నవారితో ఎక్కువగా క్లోజ్ గా ఉంటూంటారు. కానీ ఏ పార్టీకి కొమ్ము కాయరు. మహా అయితే ఆయా పార్టీ అభిమానులైతేనో.. నాయకులు అంటే ఇష్టమైతేనో తప్ప వారితో అంటిపెట్టుకుని ఉండరు. అందుకే ఎక్కువ శాతం మంది అందరు రాజకీయ నాయకులతో స్నేహంగానే ఉంటారు. అధికారంలో ఉన్నవారికి అసలే ఎదురెళ్లరు. వారిపై ఏం కేసులు వస్తాయేమోనని వారిని భయం వెంటాడుతూ ఉంటుంది. పైగా వారి సినిమాలు ఎక్కువ షోలు వేయాలన్నా, బెనిఫిట్ షో పర్మిషన్లు కావాలన్నా, పండగ సమయాల్లో టికెట్ రేట్లు పెంచుకోవాలన్నా, వివాదాలు ఏమన్నా వస్తే పరిష్కరించుకోవాలి అనుకున్నా వారికి రాజకీయ పలుకుబడి అవసరం.

 

 

సినీ నటులకు ప్రేక్షకాదరణ మెండుగా ఉన్నా రాజకీయంగా వచ్చేసరికి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. అనేక ఈవెంట్లకు పర్మిషన్లు, షూటింగులకు పర్మిషన్లు అవసరమవుతాయి. ఎటువంటి కాంట్రవర్సీలు వచ్చిన ప్రభుత్వంపై కొంత ఆధారపడాల్సిందే. ఎన్నికల సమయంలో కూడా అధికార పార్టీకి ప్రచారం చేస్తారు. ప్రభుత్వ విధానాలను అభినందిస్తే రాజకీయంగా మైలేజీ పెరుగుతుంది. వారికీ ప్రజల్లో ఆదరణ ఉంటుంది. అందుకే సినిమా – రాజకీయం కలిసి ఉండాల్సిందే.. ప్రయాణించాల్సిందే. తప్పదు మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: