అద్భుతాన్ని ఆస్వాదించాలే గానీ.. రీ క్రియేట్ చేయాలంటే చాలా కష్టపడాలి అంటారు. కానీ ప్రేక్షకులకు ఓ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ చెప్పాలనే తపన ఉంటే.. ఎంత కష్టమైనా చాలా లైట్ గా కనిపిస్తుంది. జాను మ్యూజిక్ తో గోవింద్ వసంత కూడా ఇలాగే తెలుగు ప్రేక్షకులను ఎమోషనల్ జర్నీ చేయిస్తున్నాడు.

 

జాను సినిమా ఆడియన్స్ ని ఎమోషనల్ జర్నీ చేయిస్తుందని యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా చెబుతోంది. శర్వానంద్, సమంత కెమిస్ట్రీకి బాక్సాఫీస్ కూడా ప్రేమలో పడుతుందని స్టేట్ మెంట్ ఇస్తున్నారు. వాళ్ల మాటలకు మరింత బలం చేకూర్చుచూ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి జాను పాటలు. 

 

తమిళ హిట్ 96 రీమేక్ గా రూపొందింది జాను. తమిళ వెర్షన్ కు సంగీతం అందించిన గోవింద్ వసంతనే తెలుగు వెర్షన్ కు ట్యూన్స్ ఇచ్చాడు. ఒరిజినల్ ఎమోషన్స్ నే తీసుకొస్తున్నామని నిర్మాతలు చెప్పినట్టే.. ఒరిజినల్ ట్యూన్స్ దింపేశారు. ఇక గోవింద్ వసంత ఇచ్చిన ట్యూన్స్ కు తెలుగు లిరిక్స్ కూడా పర్ ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. 

 

చాలా మంది సంగీత దర్శ కులు ఒరిజినల్ ట్యూన్స్ రీక్రియేట్ చేసినపుడు లిరిక్స్ కొంచెం తేడాగా అనిపించిన సందర్భాలున్నాయి. ఆ లిరిక్స్ సెట్ అవ్వక బోల్తాపడిన ఆల్బమ్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ జాను మాత్రం ఇలాంటి మిస్టేక్స్ కు దూరంగా ఆడియన్స్ కు చాలా దగ్గరగా వెళ్లింది. దీంతో గోవింద్ వసంత సాంగ్స్ సూపర్ అనే కామెంట్స్ వస్తున్నాయి. 

 

మొత్తానికి జాను మూవీపై టాలీవుడ్ లో గట్టి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. తమిళ రీమేక్ కావడం పైగా.. శర్వానంద్, సమంత జోడీగా నటిస్తుండటంతో అంచనాలు పెద్దగానే ఉన్నాయి. శర్వానంద్ యాక్టింగ్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్ర ఇచ్చినా ఇలానే ఒదిగిపోయే గుణం శర్వానంద్ ది. ప్రస్థానం, గమ్యం చిత్రాలతో అది నిజమైంది. ఇక సమంత ఆల్ రెడీ తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: