ఆంధ్ర రాష్ట్ర రాజకీయం మొత్తం ఇప్పుడు మూడు రాజధానులు చుట్టూ తిరుగుతుంది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఉన్న పెద్దల చేత జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని విఫలం చేయాలని చాలా ప్రయత్నాలు చేశాయి. ఇటువంటి తరుణంలో కేంద్రంలో ఉన్న పెద్దలు ఇటీవల పార్లమెంటు సమావేశాలలో రాష్ట్రానికి రాజధాని లకు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలే తీసుకున్న అధికారం వాటికి ఉందని క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా మిగతా పార్టీల నాయకులు ఏపీకి సంబంధించి రాజధానుల విషయంలో ఏం మాట్లాడలేని పరిస్థితి అయింది. ఇటువంటి తరుణంలో జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయంపై శృంగార తార షకీలా అదిరిపోయే పంచ్ వేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

మేటర్ లోకి వెళ్తే సౌత్ ఇండియాలోనే సెక్స్ బాంబ్ గా అప్పట్లో సన్నిలియోన్ టైప్ క్రేజ్ కలిగిన షకీలా కుర్రకారును ఒక ఊపు ఊపింది. గత కొంత కాలం నుండి సినిమాలు ఆపేసిన షకీలా ఇటీవల రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారి షకీలా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం’ మూవీ తాజాగా టీజర్ విడుదలైంది. వీఎన్ సతీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను 24 క్రాఫ్ట్స్ బ్యానర్ పై సతీష్ నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ టీజర్ లో షకీలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పై ఆయన తీసుకున్న 3 రాజధానుల నిర్ణయంపై వెటకారం చేసినట్టు డైలాగ్ వేయటం ఎప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ మరియు సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.

 

షకీలా మూవీ టీజర్ లో ‘ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు’ అని పేపర్ లో వార్తను చదివి షకీలా ఆశ్చర్యపోతుంది. ‘ఆంధ్రాకి మూడు రాజధానులేంటి?’ అని అసిస్టెంట్ గా పనిచేస్తున్న వ్యక్తిని ప్రశ్నిస్తుంది. దీనికి అసిస్టెంట్ .. జగన్ అన్న మూడు రాజధానులు చేసేశాడుగా’ అని సమాధానిమిస్తాడు.. దీనికి పంచ్ వేస్తూ షకీలా.. ‘ఒక్క స్టేట్ కే మూడు రాజధానులా? పోను పోను ఒక్క రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులైనా ఆశ్చర్య పోనవసరం లేదు’ అని పంచ్ వేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఏపీ రాజకీయాల్లో వైరల్ గా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: