బుల్లితెర ప్రేక్ష‌కులు ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఎందుకంటే ఓవైపు ఆక‌ట్టుకునే సీరియ‌ల్స్‌.. మ‌రోవైపు అల‌రించే షోలు మరియు ఈవెంట్లు ఇలా ఏదో ఒక దానితో ఫుల్ బిజీగా ఉంటారు. ముఖ్యంగా ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే అదిరిపోయే షోలు గురించే ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. జ‌బ‌ర్ద‌స్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ, పోవే పోరా, క్యాష్ ఇలా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. తెలుగు టెలివిజ‌న్ చ‌రిత్ర‌లో జ‌బ‌ర్ద‌స్త్, ఎక్స్ట్రా జబర్దస్త్  కామెడీ షోల‌కు ఉన్న పాపులారిటీ గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న ఈ షోకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

 

అలాగే మల్లెమాల ప్రజెంట్స్‌లో సుధీర్, విష్ణు ప్రియ జోడీగా ‘పోవే పోరా’ అనే కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకుల్ని ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుంది. తెలుగులో ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఢీ’ షోకు స్పెషల్ క్రేజ్ ఉంది. ఇప్పటికే ‘ఢీ’  ప్రోగ్రామ్ 11 సీజన్లు కంప్లీట్ చేసుకొని 12వ సీజన్లో అడుగుపెట్టింది. ఈ ప్రోగ్రామ్‌తో ఎంతో మందిని డాన్సర్లతో పాటు డాన్స్ మాస్టర్స్‌ను చేసింది. ఇక ప్ర‌తి శ‌నివారం ప్ర‌సార‌మ‌య్యే సుమ‌క్క క్యాష్‌కు కూడా ఫుల్ ఫాలోంగ్. ఈ క్ర‌మంలోనే ఈ  షోల‌కు రికార్డు స్థాయి వ్యూస్ మరియు టీఆర్పీ రేటింగ్స్ వస్తుంటాయి. అయితే వీటన్నిటికీ సంబంధించి ఒక్కక్క ప్రోమోను ఒక్కో రోజు విడుదల చేస్తారన్న సంగతి అందరికి తెలిసిందే. 

 

మ‌రియు ఇలా విడివిడిగా కాకుండా అన్నీ ప్రోమోలు కలిపి ప్రతీ వారం ఒక ఆల్ ఇన్ వన్ ప్రోమో గా విడుదల చేస్తారు. అలా ఈ వారం టెలికాస్ట్ కాబోయే షోలకు సంబంధించిన ప్రోమోలు అన్ని కలిపి చేసిన ఆల్ ఇన్ వన్ ప్రోమో మొట్టమొదటి సారిగా యూట్యూబ్ లో నెంబర్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇప్పటి వరకు అయితే ఇంతకు ముందు వచ్చిన ఏ ఆల్ ఇన్ వన్ ప్రోమో కూడా ఈ ఫీట్ ను సాధిచింది లేదు. ఈ ప్రోమో ఒక్క నెంబర్ స్థానంలో ట్రెండ్ అవుతుండడమే కాకుండా 17 లక్షల వ్యూస్ కూడా తెచ్చుకుంది. ఇలా ఈటీవిలో ప్ర‌సార‌మ‌య్యే అన్ని షోలు ఒకేసారి నెంబ‌ర్ వ‌న్ స్టానంలో ఉన్నాయ‌న్న‌మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: