ఆల్రెడీ తమిళ హీరో విజయ్ ఆంటోనీ తను చేసిన సినిమా రిలీజ్ ముందే ప్రమోషన్స్ కోసం మొదటి పది నిమిషాలు లేదా సినిమాలోని ఒక సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేయడం చేశాడు. అయితే అది తమిళ హీరో తెలుగులో రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి ప్రమోషన్స్ కోసమని అనుకున్నారు. అయితే లేటెస్ట్ గా దిల్ రాజు కూడా 96 రీమేక్ గా వస్తున్న జాను సినిమా నుండి రిలీజ్ కు ముందే ఒక సాంగ్ వీడియో రిలీజ్ చేశారు. జాను నుండి లైఫ్ ఆఫ్ రాం సాంగ్ ఫుల్ వీడియో రిలీజైంది. 

 

కోలీవుడ్ లో విజయ్ సేతుపతి, త్రిష నటించిన ఈ సినిమా తెలుగు రీమేక్ జానులో శర్వానంద్, సమంత నటించారు. ఈ శుక్రారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ ఏర్పడింది. ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచింది. జాను పాత్రలో సమంత అదరగొట్టేస్తుందని అంటున్నారు. సినిమా నుండి ఫుల్ సాంగ్ రిలీజ్ చేయడంలో దిల్ రాజు తెలివితేటలు అర్ధమవుతున్నాయి. ఇప్పటికే సినిమాపై ఉన్న క్రేజ్ ను మరింత పెంచేలా ఈ వీడియో సహకరిస్తుందని చెప్పొచ్చు.

 

ముఖ్యంగా శర్వానంద్, సమంతల జోడీ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. సినిమా ప్రమోషన ఈవెంట్స్ లో శర్వానద్ నటన గురించి సమంత.. సమంత నటన గురించి శర్వానంద్ ఒకరికొకరు మెచ్చుకుంటూ మాట్లాడారు. అయితే ముందు శర్వానంద్ కు 96 తెలుగు రీమేక్ చేసే ఆలోచన లేకున్నా సమంత ఫీమేల్ లీడ్ అని తెలిశాకే అతను ఓకే చెప్పినట్టు వివరించాడు. ఈ ఇయర్ ఆల్రెడీ సంక్రాంతికి రిలీజైన అన్ని సినిమాలతో పరోక్షంగా లాభపడ్డ దిల్ రాజు ఈసారి నిర్మాతగా సక్సెస్ అందుకునేలా ఉన్నాడు. ఇక ఇన్నేళ్ల ప్రొడక్షన్ లో మొదటిసారి కోలీవుడ్ రీమేక్ చేయడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: