టాలీవుడ్ బాహుబలి మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా మన తెలుగు వారికే కాదు, అటు తమిళ్ తో పాటు నార్త్ వారికి కూడా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్, మెల్లగా ఒక్కొక్క అవకాశం అందుకుంటూ నేడు టాలీవుడ్ హీరోలందరినీ దాటి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ఇక ప్రభాస్ ని వ్యక్తిగతంగా కలిసిన వారు చెప్పే మాట ఒక్కటే, ఆయన అందరినీ కూడా డార్లింగ్ అని పిలుస్తూ ఎంతో ప్రేమానురాగాలు కురిపిస్తుంటారని అంటుంటారు. 

 

మరి అటువంటి ప్రభాస్ ఏంటి, హీరో నిఖిల్ ని నిర్ధాక్షిణ్యంగా బయటకు నెట్టేయడం ఏంటని అనుకుంటున్నారా. అయితే ఇది పూర్తిగా చదవండి. ప్రస్తుతం సోషల్ మీడియాలో కొందరు ఫన్నీగా క్రియేట్ చేసిన వాట్సాప్ పిక్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక ఆ వాట్సాప్ పిక్ ని బట్టి చూస్తే, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వాట్సాప్ లో టాలీవుడ్ సింగిల్స్ అడ్డా అనే ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు, అందులో తనతో పాటు రానా, అడివి శేష్, అనుష్క, కాజల్, శర్వానంద్, విజయ్ దేవరకొండల తో పాటు నిఖిల్ ని కూడా యాడ్ చేస్తారు. 

 

అయితే మొన్న రెండు రోజుల క్రితం నిఖిల్ కు డాక్టర్ పల్లవి వర్మ అనే అమ్మాయితో ఎంగేజిమెంట్ జరగడంతో, అతడి ఫియాన్సీ తో కలిసి నిఖిల్ దిగిన ఫోటోని విజయ్ దేవరకొండ తమ గ్రూప్ లో పోస్ట్ చేయడంతో, అది చూసిన గ్రూప్ సభ్యుల్లోని అడ్మిన్ అయిన ప్రభాస్, వెంటనే నిఖిల్ ని గ్రూప్ నుండి రిమూవ్ చేస్తారు. అంటే అది కేవలం పెళ్లి కాని బ్యాచిలర్స్ గ్రూప్ కావడంతో, సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న నిఖిల్ ని ప్రభాస్ రిమూవ్ చేశారన్నమాట. ఇక సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతన్న ఈ పిక్ చూసిన హీరో నిఖిల్, దానిని రీట్వీట్ చేస్తూ, ఎంతో సరదాగా పడి పడి నవ్వుతున్న ఎమోజిలను పోస్ట్ చేసారు. ఇక దీనిపై కొందరు నెటిజన్లు సైతం ఎంతో ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: