టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీ డేస్ సినిమా తో వరుణ్ సందేశ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలో అదిరిపోయే పేరు సంపాదించాడు. ఆ తర్వాత వచ్చిన కొత్త బంగారం లోకం సినిమాతో లవర్ బాయ్ గా మారిపోయాడు. అమ్మాయిల ఫాలోయింగ్ కలిగిన వరుణ్ సందేశ్ ఆ తర్వాత చేసిన సినిమాలు మొత్తం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటం జరిగింది. అయితే చాలా రోజుల వరకూ  సినిమాల్లో కనిపించకుండా పోయిన వరుణ్...ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో అద్భుతంగా గేమింగ్ ఆడి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలవడం జరిగింది. టాప్ 5 దాకా వెళ్ళిన వరుణ్ సందేశ్ కొంచెం లో టైటిల్ మిస్ అవ్వడం జరిగింది.

 

ఇటువంటి నేపథ్యంలో ఈ షో తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన వరుణ్ సందేశ్ ప్రస్తుతం బయట ఇంటర్వ్యూలు ఇస్తూ కొన్ని సినిమాలు స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రముఖ టీవీ షోలో ఆలీతో ఇంటర్వ్యూ సందర్భంగా వరుణ్ సందేశ్ మరియు భార్య వితిక పాల్గొనడం జరిగింది. దీంతో ఈ షో కి సంబంధించిన ప్రోమో ఇటీవల రిలీజ్ అయింది. ప్రోమో లో ఆలీ వరుణ్ సందేశ్ ని మరియు భార్య వితికనీ సరదా  ప్రశ్నలు అడగడం జరిగింది.

 

ప్రోమో గమనిస్తే వరుణ్, వితికలకు అలీ నుంచి సరదా ప్రశ్నలు ఎదురయ్యాయి. వితిక ఎప్పుడూ తనకు భయపడదని.. తాను మాత్రం వితిక అంటే కొంచెం భయపడతానని వరుణ్ తెలిపాడు. దీనితో.. బిగ్ బాస్ పూర్తయిపోయింది ఇక బయటకు రా నాన్నా అంటూ వితిక వరుణ్ పై ఫన్నీ జోక్స్ వేసింది. పెళ్లి విషయాన్ని గురించి అలీ మాట్లాడుతూ వితికని పెళ్లి చేసుకోకపోయి ఉంటే.. ఏ హీరోయిన్ ని పెళ్లి చేసుకునేవాడివి అని అలీ ప్రశ్నించారు. దీనికి వరుణ్ తనకు ఇలియానా అంటే చాలా ఇష్టమని ఆమెను పెళ్లి చేసుకునేవాడిని అన్నట్టు వరుణ్ సందేశ్ ప్రోమోలో ఆన్సర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: