పవన్ కళ్యాణ్ కి ఒక్కసారిగా మూడు ఉత్సాహం అన్ని కలి వచ్చినట్టున్నాయి. సంక్రాంతి తర్వాత ఒక్కసారిగా సినిమాలతో బిజీ అయ్యాడు. అజ్ఞాతవాసి తర్వాత అసలు సినిమాలే చేయను అని పదే పదే చెప్పిన పవర్ స్టార్ యూ టర్న్ తీసుకొని ఒకేసారి అటు రాజకీయాలు ఇటు సినిమాలు అంటూ తెగ హడావిడి చేస్తున్నారు. వాస్తవంగా పవన్ సినీ కెరీర్ లో ఇంతగా సినిమాలకోసం సమయమిచ్చింది లేదు. పైగా ఒకేసారి రెండు మూడు సినిమాలు షూటింగ్ జరుపుకున్న సందర్భాలు చాలా తక్కువ. లాగే ఒకే సంవత్సరం సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు చాలా తక్కువ. కానీ ఆ ట్రాక్ రికార్డ్ ని పవర్ స్టార్ బద్దలు కొట్టాడు.

 

నిన్న మొన్నటివరకు పొద్దునే సినిమా షూటింగ్ సాయంత్రం రాజకీయాలంటూ ఫ్లైట్ ఎక్కి దిగిన పవన్ బిజీ షెడ్యూల్‌కి పవన్ ఫాన్స్ తో పాటు ఇండస్ట్రీలో చాలామంది  ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఎప్పుడూ స్లో‌గా సినిమాలు చేసే పవన్ డబ్బు సంపాదించడానికే సినిమాలు చేస్తున్నా.. వరసగా సినిమాలు లైన్‌లో పెడుతూ నిర్మతలకే ఊపిరాడనివ్వడం లేదు. మరి పవన్ సినిమాల విషయంలో పొద్దున్నే సినిమా షూటింగ్ సాయంత్రం రాజకీయం అన్నది కాస్త.. ఇప్పుడు పొద్దున్నే క్రిష్ కాంబో మూవీ షూటింగ్.. సాయంత్రం దిల్ రాజు పింక్ రీమేక్ సినిమా షూటింగ్ అంటు దర్శకులిద్దరికి బాత్రూం కి వెళ్ళే సమయం కూడా ఇవ్వడం లేదట. 

 

ఫస్ట్ షెడ్యూల్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో ఉదయం క్రిష్ సినిమా చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తుంది. తరువాత సాయంత్రం.. దిల్ రాజు పింక్ రీమేక్ చిత్రీకరణ కోసం అన్నపూర్ణ 7ఎకరాల పింక్ రీమేక్ షూటింగ్ స్పాట్ కి పవన్ మారుతున్నాడట. అలా పవన్ కళ్యాణ్ ఒకేసారి రెండు సినిమాలను పూర్తి చేయబోతున్నారు. ఇక పవన్ షూటింగ్ ప్లానింగ్ ని బట్టే.. క్రిష్, వేణు శ్రీరామ్.. పవన్ కళ్యాణ్ షూటింగ్ షెడ్యూల్ కి పక్కా ప్లాన్స్ వేసుకుని మరీ సినిమా షూటింగ్ జరుపుతున్నారట. ఇక పవన్ కళ్యాణ్ కూడా దర్శకులకు సహకరిస్తున్నారని... అందుకే దిల్ రాజు కూడా పింక్ రీమేక్ విడుదలను టైటిల్ ని ఎనౌన్స్ చెయ్యకుండా డేట్ రివీల్ చేసాడని చెప్పుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: