సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగానే కాకుండా వ్యాపార రంగంలోనూ విజయవంతంగా రాణిస్తున్నారు. అందులో కూడా మహేష్ సూపర్ స్టారే అనిపించుకుంటున్నాడు. ఒక వైపు సినిమాలు బిజినెస్ వ్యవహారాలను సమ్ర్ధవంతంగా నిర్వహిస్తూ ఇండస్ట్రీలో అందరికి షాకిస్తునారు. అందులో భాగంగానే హైదరాబాద్ గచ్చిబౌళిలో ఏఎంబీ సినిమాస్ గ్రాండ్ గా సక్సెస్ నేపథ్యంలో యమా స్పీడ్ లో నెక్స్ట్ వెంచర్ కి ప్రణాళికల్ని సిద్ధం చేస్తుండడం ఇప్పుడు ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాల్లోను ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీనికోసం సూపర్ స్టార్ మహేష్ - నమ్రత జంట ఇప్పటికే ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంలో ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా  ఇటు హైదరాబాద్ అటు బెంగళూరు సహా ఏపీలో కూడా మరికొన్ని చోట్ల మాల్స్ కం థియేటర్లను నిర్మించనున్నారని తాజా స్మాచారం. అందుకోసం వందల కోట్ల పెట్టుబడుల్ని జాయింట్ వెంచర్ రూపంలో భారీ స్థాయిలో ఖర్చు పెడుతున్నారు.

 

బెంగళూరు ఏఎంబీ గురించి గత కొంతకాలంగా అంతో ఇంతో న్యూస్ లీకవుతూనే ఉంది. తాజా సమాచారం ప్రకారం.. నమ్రత మహేష్ ఇప్పటికే బెంగళూరు ఏఎంబీ పనుల్ని ప్రారంభించారట. హైదరాబాద్ ఏఎంబీ మాల్ కి అన్నీ తానే అయ్యి వ్యవహరించిన నమ్రత బెంగళూరులోనూ ఇంతకుమించిన నిర్మాణం చేపట్టేందుకు శ్రద్ధ తీసుకుంటున్నారట. ఇంటీరియర్ డిజైన్ తో సహా లుక్ గ్రాండ్ గా ఉండే విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆ మేరకు ప్రముఖ ఆర్కిటెక్చర్ల ను సంప్రదించారని తెలుస్తోంది. గ్రీన్ సిటీ బెంగళూరు లో సాఫ్ట్ వేర్ హబ్ ఉన్న కాస్ట్లీ ఏరియాలోనే ఏఎంబీ మాల్ ని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. 

 

హైదరాబాద్ గచ్చిబౌళి లో ఉన్నట్టుగానే మరో కాస్ట్లీ ఏరియాలోను ఏఎంబీ మాల్ నిర్మించే ఆలోచన ఉన్నారని ఇంతకముందు తెలిసిన విషయమే. ఇక తెలంగాణలోను కొన్ని నగరాలు సహా.. ఏపీలోనూ విశాఖ రాజధానిలోనూ ఏఎంబీ ని విస్తరించే ప్లాన్ ఉందట. విజయవాడ- తిరుపతి సహా పలు నగరాల్లో ఏఎంబీ మాల్స్ ని విస్తరించే ఆలోచనలో మహేష్ నమ్రత ఉన్నట్టు తెలుస్తోంది. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో భారీగా స్థలాల్ని కొనుగోలు చేయడం అక్కడ మాల్ నిర్మాణానికి సానుకూలతల్ని వెతకడం ఆ తర్వాత నిర్మాణాలు చేపట్టడం... ప్లాన్స్ రెడీ అవుతున్నాయట. ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యం లో మహేష్ - నమ్రత బృందం ఈ ప్రణాళికల్ని విస్తరిస్తుండడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక మహేష్ తదుపరి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందబోయో సినిమాలో నటించడానికి సిద్దమవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: