స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సంక్రాంతికి అల వైకుంఠపురంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిబాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించి పెద్ద సక్సెస్ అయ్యింది. 2020 ఆరంభంలోనే ఇండస్ట్రీ దక్కిందంటూ చిత్ర యూనిట్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కెరీర్ లో ఇన్నేళ్లకు ఇండస్ట్రీ హిట్ దక్కడంతో బన్నీ ఆనందానికైతే అడ్డుకట్ట పడటం లేదు. ప్రస్తుతం అల వైకుంఠపురంలో సినిమాసక్సెస్ ను పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నాడు. వరుసగా పార్టీలు ఇస్తూ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. 

 

గత రెండు వారాలుగా బన్నీ వరుసగా పార్టీల మీద పార్టీల్లో మునిగి తేలుతున్నాడని సమాచారం. మొన్న కూడా దర్శకులందరికి పార్టీ ఇచ్చాడు బన్ని. అయితే ఇదే సమయంలో సుకుమార్ కు బన్నీ కోపం తెప్పించేలా చేస్తున్నాడట. బన్నీ 20వ సినిమా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి కూడా చేశారు. రెండవ షెడ్యూల్ ను జనవరి చివరి వారంలో మొదలు పెట్టాలని సుకుమార్ అన్ని ప్లాన్ చేసుకున్నాడు. కాని బన్నీ పార్టీలల్లో మునిగి తేలుతూ సుకుమార్ కు డేట్లు ఇవ్వడంలేదట.

 

ఇప్పటికే రెండవ షెడ్యూల్ ను రీ షెడ్యూల్ చేయడం జరిగిందని చెప్పుకుంటున్నారు. ఫిబ్రవరి రెండవ వారానికి రీ షెడ్యూల్ చేసిన సుకుమార్ ఆ తేదీకి అయినా బన్నీ వస్తాడా లేదా అనే అనుమానంలో ఉన్నాడట. సుకుమార్ రంగస్థలం సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని బన్నీ 20 సినిమాని రూపొందిస్తున్నారు. సినిమా మొదలైన తర్వాత కూడా ఇలా ఆలస్యం చేస్తుండటంతో సుకుమార్ లో లోపల చిరాకు పడుతున్నట్లు గా ఫిల్మ్ నగర్ లో టాక్ మొదలఒంది. మరి బన్నీ ఇంకా ఆ మూడ్ నుండి బయటకి ఎప్పుడు వస్తాడో. 

 

వాస్తవంగా సుకుమార్ ఈ సినిమాని దసరా కంటే ముందే విడుదల చేయాలని సన్నాహాలు చేసుకున్నాడట. కాని బన్నీ మాత్రం వైకుంఠపురంలోనే మునిగి తేలుతున్నాడని.. ఇప్పటికైనా వైకుంఠపురం నుండి బయటకు రావాలంటూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ బన్నీ కి ట్వీట్స్ పెడుతున్నారట. మరి అయ్యగారు ఎప్పుడు వస్తారో సుక్కు తో ఎప్పుడు కలుస్తాడో.

మరింత సమాచారం తెలుసుకోండి: