మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో నాగబాబు కొడుకు మెగా ప్రిన్స్ గా పేరు తెచ్చుకున్న వరుణ్ తేజ్ స్టైలే వేరు. ఎంత మెగా కాంపౌండ్ అండదండలు పుష్కలంగా ఉన్నా సరే తనకంటూ ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. బెటర్ స్క్రిప్ట్స్ తో, వెరైటీ కాన్సెప్ట్స్, బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో మెగా కాంపౌండ్ పరువు నిలబెడుతున్నాడు. ఈ ఐదేళ్లలో అతని సినిమాల సరళిని చూస్తేనే అర్ధమవుతుంది వరుణ్ ఎంత వెర్సటైల్ ఆర్టిస్ట్ గా ఎదగాలనుకుంటున్నాడో. ప్రతి వ్యక్తికి ఉన్నట్టే తనకంటూ ఓ కోరిక ఉందనీ.. ఆ కోరిక తీరటం లేదని అంటున్నాడు.

 

 

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ను కలవాలని.. అతనితో కలిసి ఓ కప్ కాఫీ తాగాలని ఉందని తన మనసులో మాటగా చెప్పుకొస్తున్నాడు. ‘షారుఖ్ కు నేను వీరాభిమానిని. ఓసారి రామ్ చరణ్ అన్న ఇంటికి షారుఖ్ వచ్చాడు. కానీ.. అనుకోని కారణాలతో నేను కలవలేకపోయాను. ఇప్పుడు మళ్లీ అవకాశం రావడంలేదు. అతనితో కూర్చుని ఓ కప్ కాఫీ తాగాలి. సరదాగా మాట్లాడాలి.. కొత్త విషయాలు నేర్చుకోవాలి. అవకాశం వస్తే షారుఖ్ తో నటించాలని ఉంది’ అంటూ తన ఇష్టాన్ని చెప్పుకుంటున్నాడు. సినిమా విషయమేమో కానీ.. షారుఖ్ ని కలవడమనేదది నిజానికి వరుణ్ కోరిక తీరనిది ఏమీ కాదు.

 

 

చిరంజీవి కానీ, చరణ్ కానీ తలచుకుంటే అదేమంత తీరని కోరిక కాదు. క్షణాల్లో ఏర్పాట్లు చేయగలరు. కానీ అవకాశం వస్తే ఉపయోగించుకోవాలి కానీ.. కల్పించుకుని కాదు అనేది వరుణ్ ఆలోచనగా ఉంది. పెద్ద నాన్న గౌరవాన్ని, తండ్రి నమ్మకాన్ని నిలబెడుతున్న వరుణ్ తేజ్ అంటే మెగా అభిమానులకు కూడా ఇష్టమే. ప్రస్తుతం వరుణ్ బాక్సర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్లో త్వరలోనే ఈ సినిమా షూటింట్ ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: