ఎప్పుడు హీరోయిన్స్ డ్రెస్ విషయంలో ఎక్కువగా నెటిజన్స్ హాట్ టాపిక్ గా మాట్లాడుతుండటం చాలా కామన్. ఎప్పుడెప్పుడు వాళ్ళు ఏ డ్రెస్ వేసుకుంటారా అన్న ఆలోచన తోను కొందరు కాచుకొని కూర్చుంటారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్ విషయంలో ఇలా ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. సెమీ న్యూడ్ గా ఉన్న డ్రెస్ లతో బాలీవుడ్ హీరోయిన్స్ ఎప్పుడు ఏదో రకంగా అందరితో కామెంట్స్ వేపించుకుంటుంటారు. కొన్ని సార్లు బికిని సూట్స్ కంటే కూడా వీళ్ళు వేసుకునే డిఫ్రెంట్ డ్రెస్ ల గురించే జనాలు పిచ్చెక్కినట్టు మాట్లాడుతుంటారు. ఇక రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ధరించిన డ్రెస్‌ గురించి విపరీతంగా ట్రోల్స్‌ వస్తున్న సందర్భంగా మరో బాలీవుడ్‌ నటి హీనాఖాన్‌ ఆవేశంతో విరుచుకుపడి నెటిజన్లకు ఛాలెంజ్‌ విసిరారు. 

 

హాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘గ్రామీ’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో తన భర్త నిక్‌ జొనాస్‌తో కలిసి నటి ప్రియాంక చోప్రా సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు ప్రియాంక వైట్‌ అండ్‌ క్రీమ్‌ కలర్‌లో ఉండే ఓ డ్రెస్‌ను ధరించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ప్రియాంక ఇన్‌స్టా లో అభిమానులతో పంచుకున్నారు. దీంతో చాలా మంది నెటిజన్లు ఆమె డ్రెస్సింగ్‌ పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రియాంక డ్రెస్సింగ్‌ చాలా చెత్తగా ఉందంటూ కామెంట్లు చేశారు. పెళ్ళాం అలా అన్నీ కనిపించేలా డ్రెస్ వేసుకొని పబ్లిక్ లోకి వస్తుంటే పక్కనే ఉండి ఏం చేస్తున్నావ్ బుద్ది లేదా నీకు ..! అంటూ ప్రియాంక భర్త నిక్ ని ఏకిపారేస్తున్నారు. 

 

ఈ నేపథ్యంలో తాజాగా ప్రియాంక, ఆమె తల్లి మధు చోప్రా సోషల్‌మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రియాంక డ్రెస్‌ గురించి వస్తున్న ట్రోల్స్‌పై మరో బాలీవుడ్‌ నటి హీనాఖాన్‌ స్పందించారు. ఒకరు వేసుకున్న డ్రెస్‌ గురించి కామెంట్‌ చేయడానికి మీరెవరూ అని హీనా నెటిజన్స్ ని సూటిగా ప్రశ్నించారు. ‘గ్రామీ వేడుకకు ధరించిన దుస్తులు ప్రియాంకకు సౌకర్యవంతంగా ఉన్నప్పుడు.. కామెంట్‌ చేయడానికి మీరెవరూ?’ అని హీనా ఖాన్‌ ప్రశ్నించారు. అంతేకాకుండా ప్రియాంక డ్రెస్‌ గురించి ట్రోల్స్‌ చేస్తున్న వారికి హీనాఖాన్‌ ఓ ఛాలెంజ్‌ విసిరారు. ‘ప్రియాంక డ్రెస్‌ గురించి ఎవరైతే ట్రోల్స్‌ చేస్తున్నారో వాళ్లు.. ఆ దుస్తులను 10 నిమిషాలపాటు ధరించి చూపించాలని ఓపెన్‌ ఛాలెంజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ డ్రెస్‌ ధరించడం అంత సులభంకాదు. అంతేకాకుండా డ్రెస్‌తో అంతపెద్ద వేడుకలో అందర్నీ మెప్పించడం, ఫొటోలకు పోజులివ్వడం అంటే చిన్న విషయం కాదు. అలాంటి డ్రెస్సులు ధరించాలంటే అందంతోపాటు ధైర్యం కావాలి.’ అని హీనా ఖాన్‌ నెటిజన్స్ కి క్లాస్ పీకారు.

 

మొతానికి ప్రియాంక డ్రెస్ ఇంత హాట్ టాపిక్ అవడం బాలీవుడ్ లో రక రకాల చర్చలకి దారి తీస్తోంది. కామన్ ఆడియిన్స్, నెటిజన్సే ఇలా ప్రియాంక డ్రెస్ మీద కామెంట్ చేస్తుంటే ఇంకా కంగన సిస్టర్స్ ఎందుకనో రియాక్ట్ కాలేదు. సాధారణంగా వీళ్ళందరి కంటే వాళ్ళే ముందు ఎగేసుకుంటూ బయలుదేరతారు. మరి ఎక్కడ బిజీగా ఉన్నారో ప్రియాంక ని ఇంకా చూసినట్టు లేదు.
    

మరింత సమాచారం తెలుసుకోండి: