జానపద సినిమాల యుగంలో ఎన్టీఆర్ కాంతారావులతో ఎన్నో హిట్ సినిమాలలో నటించిన రాజశ్రీ అప్పటి కాలంలో ఒక వెలుగు వెలిగిన గ్లామర్ హీరోయిన్. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె ఈమధ్య ‘అలీ తో సరదాగా’ కార్యక్రమానికి వచ్చి సందడి చేసింది. 

 

అప్పటి సీనియర్ హీరోలతో ఆమె నటించిన అప్పటి పరిస్థితులను గుర్తుకు చేసుకుంటూ మధ్యలో చిరంజీవి సురేఖల పెళ్లికి తాను ఎలా సూత్రధారిగా వ్యవహరించింది అన్న విషయాలను గుర్తుకు చేసుకుంది. తనకు చిన్నప్పటి నుంచే  ఇండస్ట్రీలో అందరికంటే అల్లు రామలింగయ్య కుటుంబంతో తన ఫ్యామిలీకి మంచి సంబంధ బాంధవ్యాలు ఉండేవి అన్న విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ అల్లు రామలింగయ్య పిల్లలతో తాను కలిసి ఆడుకున్న విషయాలను గుర్తుకు చేసుకుంది. 

 

అప్పట్లో తాను అల్లు రామలింగయ్యతో కలిసి ‘అత్తను దిద్దిన కోడలు’ సినిమా షూటింగ్ సమయంలో తాను అల్లు రామలింగయ్యను సురేఖకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారా అంటూ అప్పట్లో అడిగిన విషయాలను రాజశ్రీ బయట పెట్టింది. అయితే తన ప్రశ్నకు అల్లు రామలింగయ్య సమాధానం ఇస్తూ ఇండస్ట్రీలో కొత్తగా ఒక హీరో వచ్చాడని అతడు డాన్స్ లు ఫైట్లు బాగా చేస్తున్నాడని చెప్పి చిరంజీవి ప్రస్తావన తన వద్ద తీసుకు వచ్చినట్లు గుర్తుకు చేసుకుంది. 

 

ఆ మాట అల్లు రామలింగయ్య నోటివెంట తాను వినగానే మరొక ఆలోచన లేకుండా వెంటనే సురేఖకు చిరంజీవితో ఫిక్స్ చేయమని తాను పట్టుపట్టి చిరంజీవి సురేఖల పెళ్ళికి పరోక్షంగా సహకరించిన విషయాలను బయటపెట్టింది. వాస్తవానికి అప్పటికి చిరంజీవి చాల చిన్న హీరో అనీ అయితే తన మనసు మాత్రం చిరంజీవి ఎప్పటికైనా ఇండస్ట్రీలో టాప్ హీరో అవుతాడని తనకు అనిపించింది అంటూ ఆ విషయాలను గుర్తుకు వస్తే ఒక విధంగా తాను చిరంజీవి సురేఖలను కలిపిన వ్యక్తిని అన్న జ్ఞాపకాలు తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి అంటూ ఆమె కామెంట్ చేసింది..

మరింత సమాచారం తెలుసుకోండి: