సినిమాల్లో రోజు రోజుకు హీరోయిన్ల బట్టలు కరువవుతున్నట్లు ఉన్నాయనుకుంటున్నారు ప్రేక్షకులు. ఎందుకంటే ఒకప్పుడు మోకాలి వరకు ఉన్న బట్టలు, ఇప్పుడు ఇంకా పైకి తగ్గిపోయాయి. ఇదే కాకుండా, అసలు బట్టలు కట్టి కట్టనట్లుగా కట్టి నటిస్తున్నారు హీరోయిన్స్.. మొన్నామధ్య అమలాపాల్ అసలు నాకు బట్టలెందుకని పూర్తి నగ్నంగా నటించి అందర్ని ఆశ్చర్య పరిచింది. ఆమెను ఆదర్శంగా తీసుకుని కొందరు హీరోయిన్స్ మంచి పాత్ర దొరికితే తామూ అలాంటి సన్నివేశాల్లో నటించడానికి సిద్దంగా ఉన్నామని చెప్పారు కూడా..

 

 

అయితే ఇదే కోవలోకి ఇప్పుడు రాశిఖన్నా ప్రవేశించింది. పాత్ర డిమాండ్ చేస్తే తాను కూడా ఇలాంటి అర్ధనగ్న, దృష్యాల్లో నటించడానికి అభ్యంతరం లేదంటుంది.. ఇకపోతే ఈ మధ్యే వచ్చిన ప్రతి రోజు పండగే చిత్రంతో హిట్ సొంతం చేసుకున్న రాశి ఖన్నా ప్రస్తుతం, విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నటిస్తోంది. కాగా రాశిఖన్నాతో పాటుగా ఈ చిత్రంలో మరో ముగ్గురు కథానాయికలు కూడా నటిస్తున్నారట.. అయితే ఇప్పటి వరకు ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్రలల్లో, గ్లామర్ షో చేస్తున్నప్పటికీ అది శృతి మించకుండా నటించిన రాశి కన్నా వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో మాత్రం పూర్తిగా అర్ధనగ్నంగా కనిపించిన టీజర్ కుర్రకారు ఒంట్లో సెగలు రేపుతుంది..

 

 

ఇక ఈ విషయంలో కొందరు నెటిజన్స్ స్పందిస్తూ, ఓ సన్నివేశాల్లో నటించేటప్పుడు ఆమె ఒంటిపై దుస్తులు ఉన్నాయా లేదా  అని కాకుండా ఆమెలోని నటనను గుర్తించాలని అంటున్నారు. మరికొందరైతే ఇవన్నీ నటనలో భాగమని సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు ఇలాంటి వాటి గురించి పట్టించుకో కూడదని కేవలం తమ నటన వైపు మాత్రమే దృష్టి సారించాలని అంటున్నారు. అయితే ఈ విషయంపై స్పందించిన రాశి కన్నా కథ డిమాండ్ చేస్తే ఇలాంటి సీన్లలో నటించక తప్పదని అంటోంది... ఏదైనా నటించే వారున్నప్పుడు నటింపచేసేవారికేం అభ్యంతరం ఉండదు. కానీ ఇలా మధ్యలో అనవసరమైన వాదనలు చేయడం అవసరమా అని కొందరు అనుకుంటున్నారట..  

మరింత సమాచారం తెలుసుకోండి: