ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ మధ్య పోటీ ఇండస్ట్రీని మాత్రమే కాకుండా సగటు ప్రేక్షకులను కూడ వేడెక్కించడంతో ఈ రెండు మూవీలకు చాల మంచి కలక్షన్స్ వచ్చాయి. ఈ రెండు సినిమాలు 100 కోట్ల నెట్ కలక్షన్స్ ను దాటి మహేష్ బన్నీ ల మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో కొనసాగింది. 


సంక్రాంతి రేస్ విన్నర్ గా ‘అల వైకుంఠపురములో’ మారినప్పటికీ ‘సరిలేరు నీకేవ్వరును’ కూడ గుర్తిస్తున్నారు. దీనితో సంక్రాంతి వెళ్లిపోయి మూడు వారాలు గడుస్తున్నా ఇంకా సగటు ప్రేక్షకుడు సంక్రాంతి సినిమాలు గురించి మాత్రమే చర్చలు చేస్తున్నారు. 

 

సంక్రాంతి తరువాత విడుదలైన ‘డిస్కో రాజా’ ‘ఆశ్వద్దామ’ ‘చూసి చూడంగానే’ సినిమాల గురించి ఎంత ప్రమోషన్ చేసినా సగటు ప్రేక్షకుడు పెద్దగా పట్టించుకోలేదు. కొంత వరకు నాగశౌర్య తన ‘ఆశ్వద్దామ’ తో తన ఫెయిల్యూర్ గండం నుండి గట్టెక్కినా ఈ మూడు సినిమాలు ఏమాత్రం సగటు ప్రేక్షకుడి పై ప్రభావం చూపెట్టలేకపోయాయి. దీనితో ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు ఇంకా సంక్రాంతి మత్తు నుండి బయట పడలేదా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 


ఇలాంటి పరిస్థితులలో రేపు విడుదల కాబోతున్న ‘జాను’ తో సమంత ప్రేక్షకులలో ఏర్పడిన ఈ సంక్రాంతి మత్తును ఎంత వరకు పోగొట్టగలుగుతుంది అన్న విషయమై ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. ఫీల్ గుడ్ మూవీగా అతి ఉదాత్తమైన కథతో రూపొందింప బడ్డ ‘జాను’ కోసం సగటు ప్రేక్షకుడు ధియేటర్లకు రావాలి అంటే కేవలం సమంత మ్యానియా మాత్రమే రప్పించ గలగాలి. ‘ఓ బేబి’ ‘మజిలీ’ మూవీల తరువాత రాబోతున్న సమంత మూవీ కావడంతో ఆమె క్రేజ్ ఈ మూవీకి ఎంత వరకు ఓపెనింగ్ కలక్షన్స్ తెచ్చి పెట్టగలుగుతుంది అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈసినిమా కూడ మత్తును వదలించలేకపోతే మళ్ళీ ‘భీష్మ’ వచ్చేదాకా ‘అల’ కు అదృష్టం కొనసాగుతూనే ఉంటుంది..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: