ప్రస్థుతం పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమాలకు పారితోషికపరంగా 50 కోట్లు తీసుకోవడం ఎంత వరకు నిజము అన్నది క్లారిటీ లేకపోయినా క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న పీరియాడిక్ మూవీ పండుగ సాయన్న పాత్ర కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న సాహసాలు త్యాగాలు ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమాలో పవన్ చాల పొడువాటి జుట్టు పెట్టుకుని గుబురు మీసంతో చాల డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడని తెలుస్తోంది.


ముఖ్యంగా ఈ సినిమాలోని పవన్ పాత్రకు వాడబోయే కాస్ట్యూమ్స్ చాల ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా ఒక రాజఠీవిని ప్రతిబింబించే విధంగా క్రిష్ ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నట్లు టాక్. ‘సైరా’ పాత్ర కోసం చిరంజీవి కాస్ట్యూమ్స్ ను డిజైన్ చేసిన చిరంజీవి కూతురు సుష్మిత సలహాలను కూడ ప్రస్తుతం క్రిష్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.


ఇప్పటి వరకు పవన్ 25 సినిమాలు నటించినా కాస్ట్యూమ్స్ పరంగా కాని లుక్ పరంగా కాని ఎప్పుడు తన పై తాను ప్రయోగాలు చేసుకోలేదు. కేవలం టి షర్ట్ జీన్ ప్యాంట్ మినహా పవన్ కళ్యాణ్ పై భారీ కాస్ట్యూమ్స్ ప్రయోగం జరగలేదు. ఇలాంటి పరిస్థితులలో ఇప్పటికే పవన్ పై నెగిటివ్ ప్రచారం కామెంట్స్ విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితులలో పవన్ కోసం క్రిష్ క్రియేట్ చేస్తున్న ఈ జమిందారీ లుక్ ఎంత వరకు పవన్ కు నప్పుతుంది అన్న విషయమై ఇప్పటి నుంచే సందేహాలు మొదలయ్యాయి.


వాస్తవానికి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలాగే పండుగ సాయన్న పాత్ర కూడ పెద్దగా తెలుగు వారికి తెలియదు. అయితే తెలుగు వారికి పెద్దగా తెలియకపోయిన ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ పాత్రను చాల తెలివిగా మలిచి ప్రశంసలు పొందిన క్రిష్ పవన్ పండుగ సాయన్న పాత్రలో కూడ ఎదో ఒక మ్యాజిక్ చేస్తూ విపరీతంగా గ్రాఫిక్ మాయాజాలాన్ని ఈ మూవీలో ఉపయోగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: