రేపు విడుదల కాబోతున్న ‘జాను’ మూవీని ప్రమోట్ చేస్తూ ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత దర్శకులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. తాను కెరియర్ ప్రారంభం నుండి పేరు కోసమే సినిమాలు చేసినా మధ్యలో కొన్ని కేవలం డబ్బు కోసం ఒప్పుకున్నా పాత్రలు ఉన్నాయన్న విషయాన్ని అంగీకరించింది. 


తాను చదువుకునే రోజులలో కామర్స్ లో నూటికి నూరు మార్కులు వస్తాయని భావిస్తే 100 కి 1మార్క్ తక్కువగా వచ్చినందుకు తాను మూడు రోజులు తిండి తినని సందర్భాలు ఉన్నాయని అప్పటి విషయాలను గుర్తుకు చేసుకుంది. తాను మహా అయితే రెండు మూడేళ్ళు సినిమాలలో నటిస్తానని ఆ తరువాత తనకు సినిమాలలో నటించే అవకాశం ఉండదు అంటూ మరో మూడు సంవత్సరాల తరువాత తాను తల్లిని అవుతాను సంకేతాలు ఇచ్చింది.


ఇదే సందర్భంలో ఆమె మాట్లాడుతూ తన తీరని కోరికను బయట పెట్టింది. ఇప్పటి వరకు తాను నటించిన అన్ని సినిమాలలోను తనను మంచి అమ్మాయి గా చూపెట్టారని అయితే తనలోని విలనీ ని బయటపెడుతూ ఆడవాళ్ళు కూడ ద్వేషించే ఒక వెరైటీ నెగిటివ్ పాత్రలో చేయాలి అన్న తన కోరికను ఏ దర్శకుడు పట్టించుకోలేదు అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం తాను నటిస్తున్న ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ లో తాను విలన్ గా కనిపించడమే కాకుండా ఫైట్స్ చేస్తున్న విషయాన్ని బయటపెట్టింది. 


ఒక్క డూప్ సహాయం కూడ తీసుకోకుండా తాను ఆ వెబ్ సిరీస్ కోసం ఫైట్స్ చేసిన విషయాన్ని బయటపెడుతూ అలాంటి నెగిటివ్ కోణం ఉన్న పాత్రను చేసి తన కెరియర్ కు ముగింపు పలకాలని భావిస్తున్నాను అంటూ సమంత అభిప్రాయపడుతోంది. తాను ప్రస్తుతం నటిస్తున్న ‘జాను’ పాత్ర ద్వారా తనకు స్కూల్ రోజులలో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి అని సమంత చెప్పడం బట్టి సమంతను మొదటిసారి ప్రేమించిన అబ్బాయి సమంత కు గుర్తుకు వస్తున్నాడు అనుకోవాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: