టాలీవుడ్ లోకి ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ స్థాయి మాస్ ఫాలోయింగ్ సంపాదించారు ఆయన తమ్ముడు పవన్ కళ్యాన్.  ఆ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్ లు హీరోలుగా వెండి తెరకు పరిచయం కావడం వారు తమదైన స్టైల్లో మంచి పేరు సంపాదించడం జరిగింది.  రామ్ చరణ్ చేసిన సినిమాలు తక్కువే అయినా మంచి హిట్ సినిమాల్లో నటించారు.   ఇక అల్లు అర్జున్ రెండేళ్ల గ్యాప్ తర్వాత ఈ సంక్రాంతి కానుకగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.  ఇక మెగా ఫ్యామిలీ నుంచి హీరోలుగా సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లు ఎంట్రీ ఇచ్చారు. 

 

ముకుంద మూవీతో హీరోగా పరిచయం అయ్యారు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్.  ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘కంచె’ మూవీతో సంచలన విజయం అందుకున్నాడు.  ఫిదా, తొలిప్రేమ గత ఏడాది హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘గద్దలకొండ గణేష్ ’ తో మంచి విజయాలు అందుకున్నాడు.  ప్రస్తుతం ఈ మెగా ప్రిన్స్ బాక్సింగ్ నేపథ్యంలోవస్తున్న  ఓ సినిమాలో  చేస్తున్న సంగతి తెలిసిందే.   తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ బాలీవుడ్ గురించిన ప్రస్తావన తీసుకొచ్చాడు. నాకు షారుక్ అంటే ఇష్టం. ఒకసారి ఆయన చరణ్ అన్నయ్య ఇంటికి వచ్చాడు.

 

అప్పుడు ఆయనను దూరం నుంచి చూస్తూ అలాగే ఉండిపోయాను.  సినీ బ్యాగ్ గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ బాలీవుడ్ నటులతో పెద్దగా పరిచయాలు లేవు.  పెద్దనాన్న, అన్నయ్య కు అక్కడ బాగా ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ లో ఇద్దరూ నటించారు. నాకు కూడా హిందీ సినిమాల్లో నటించాలని వుంది. ఆఫర్లు కూడా వస్తున్నాయి. అయితే కథ .. కాంబినేషన్ .. డేట్లు ఇలా అన్నీ కుదరాలి. అలాంటి సమయమే వస్తే తప్పకుండా హిందీ సినిమా చేస్తా అంటూ తన మనసులో మాట చెప్పాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: