అతనొక బ్రాండ్ క్రేజీ యువ రౌడీ హీరో. వరుస సూపర్ హిట్ సినిమాలతో మంచి క్రేజ్ వచ్చింది కానీ ఈమధ్య వరస ఫెయిల్యూర్ల తో చతికల పడ్డాడు. ఇటీవల ఆయన నటించిన ఒక సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. అయితే ఈ సినిమాకు ఏమాత్రం హైప్ రావడం లేదన్న సంగతి అందరికి తెలిసినదే. షూటింగ్ డిలే కావడం.. గత సినిమాల ఛాయలు కనిపిస్తూ ఉండడంతో సినిమా ఫలితం అటూ ఇటూ అవుతుందనే అనుమానాలు కూడా టాలీవుడ్ లో ఉత్పన్నం అవుతున్నాయి. 

 

కానీ, ఈ సినిమా విజయం హీరోకు కీలకమే. ఎంత క్రేజ్ ఉన్న హీరో అయినప్పటికీ వరస ఫెయిల్యూర్లు  అతని.. మార్కెట్ ను దెబ్బ తీస్తాయనేది వాస్తవం. ఈ సినిమాకు బజ్ తీసుకురావడానికి మేకర్స్ ప్రయత్నం చేస్తున్నప్పటికీ అవేమీ ఫలించడం లేదు. ఈ హీరో తనదైన శైలిలో ఏదైనా ఒక వివాదం తలకెత్తుకుంటే తప్ప ఈ సినిమాకు కాస్తయినా క్రేజ్ వచ్చేలా లేదని కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ హీరో తన కెరీర్ మొదట్లో ఇలా వివాదాల పట్ల ఆసక్తి చూపినప్పటికీ ఇప్పుడు మాత్రం అలాంటివాటి జోలికి పోవడం లేదు.

 

దీంతో సినిమాకు క్రేజ్ తీసుకురావడం ఒకింత కష్టంగా ఉంది. మరి సినిమాకు ముందు ఏమైనా గత శైలిలో ఒక కాంట్రవర్సీ కోసం చూస్తారా అనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే ఈ యువ హీరో నెక్స్ట్ సినిమా ఒకటి ప్రకటించారు కానీ పట్టాలెక్కలేదు. ఈ సినిమా తర్వాత పెద్ద బ్యానర్ లో ఒక కమిట్ మెంట్ ఉంది. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుంది? అనే అంశం పైనే ఫ్యూచర్ ప్రాజెక్టులు.. వాటి బడ్జెట్లు.. హీరోగారి రెమ్యూనరేషన్ ఆధారపడి ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.

 

ఇక అతని గురించి వేరే పరిచయం అక్కర్లేదు... అతనే విజయ దేవరకొండ. ఇటీవల విడుదల అయిన విజయ్ దేవరకొండ - క్రాంతి మాధవ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమే ‘వరల్డ్ ఫేమస్ లవర్'. కేఎస్ రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో ఐశ్వర్య రాజేష్‌, రాశీ ఖన్నా, ఇజబెల్లె లైట్, కేథరిన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నలుగురిని ప్రేమించే వ్యక్తిగా విజయ్ దేవరకొండ కనిపించనున్నాడు. అయితే అర్జున్ రెడ్డి సినిమా ఛాయలు కనిపిస్తున్నట్లు పలువురు సినీ పరిశీలకుల భావన!     

మరింత సమాచారం తెలుసుకోండి: