దక్షిణాదిలో హీరోయిన్ నయనతార తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. సాధారణంగా హీరోయిన్లకు వయసు పెరుగుతుంటే వారికున్న డిమాండ్ తగ్గుతుంటుంది. అయితే లేడీ సూపర్‌స్టార్ నయనతార క్రేజ్ మాత్రం వయసుతోపాటే పెరుగుతోంది. దక్షిణాదిన అత్యంత పారితోషికం తీసుకుంటూ హీరోలతో సమానమైన ఇమేజ్‌ను నయనతార సంపాదించుకుంది. తమిళంలో ఇటూ హీరోయిన్‌గా చేస్తూనే మరో పక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దుమ్ము దులుపుతోంది.  సినిమాల్లోకి వచ్చి 15 ఏళ్లు దాటినా ఏమాత్రం తగ్గని తన బ్యూటీతో హీరోయిన్ చాన్సులు పట్టేస్తోంది. 

 

దీంతో లేడీ సూపర్ స్టార్ గా సౌత్ లో తన హవా కొనసాగిస్తోంది. స్టార్ హీరోలతో సమానంగా ఆమె పారితోషికం ఉంటోంది. నటనలో నయనతారకు తిరుగులేదు. అలాగే సినిమాల‌పై నయన్ పెట్టిన డిమాండ్ల గురించి అనేక వార్తలు వస్తూనే ఉంటాయి. దీంతో ఈమె తాటికి హీరోలు సైతం కుదేల్ అవుతున్నాట్టు తెలుస్తోంది. ఇక మ‌రోవైపు అక్కినేని వారి కోడలు స‌మంత‌. పెళ్లి తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారింది. అంతేకాదు మ్యారేజ్ తర్వాత ఈ కెరీర్ పీక్స్‌కి వెళ్లింది. ఇంట్లో అక్కినేని హీరోలందరు హిట్టు కోసం ఎదురు చూస్తుంటే.. ఈమె మాత్రం అలవోకగా సక్సెస్‌ల మీద సక్సెస్‌లు అందుకుంటోంది.

 

'ఏమాయ చేశావే' సినిమాతో కుర్రకారుని తనదైన మాయలో పడేసింది సమంత. ఆ సినిమా నుండి వెనుకకు తిరిగిచూడలేదు ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆమె తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరు. ముఖ్యంగా పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గానే ఉండొచ్చు.. సినిమాకు కోట్లకు కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవచ్చని నిరూపించిన హీరోయిన్ ఈమె. దీంతో హీరోల కంటే వీళ్ల‌కు ఎక్కువ క్రేజ్ ఉండ‌డంతో కొంద‌రు హీరోల బాధ‌లు వ‌ర్ణ‌నాతీతంగా ఉన్నాయ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే న‌య‌న‌తార అన్ని కండీష‌న్లు స‌మంత మాత్రం పెట్ట‌ద‌నే చెప్పాలి. ఇక ఏదేమైనా ప్ర‌స్తుతం వీళ్ల క్రేజ్‌ కోంద‌రు హీరోల‌కు న‌చ్చ‌డం లేద‌ని రూమ‌ర్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: