గత కొంత కాలంగా సినీ పరిశ్రమకు సంబంధించిన వారిపై ఇన్కమ్ టాక్స్ అధికారులు వరుస దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన నటులని టార్గెట్ చేస్తూ ఇన్కమ్ టాక్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక మొన్నటికి మొన్న హీరోయిన్ రష్మిక పై  ఐటీ దాడులు జరిగిన విషయం విధితమే. ఇక ఇప్పుడు తమిళ స్టార్ హీరో అయినా విజయ్ పై  వరుసగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. తమిళ సూపర్ స్టార్ అయిన విజయ్ తో పాటు ప్రొడ్యూసర్ అంబుజా చేజియాజ్  కార్యాలయంలో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం ఐటి శాఖ అధికారుల దాడులు తమిళ సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. గత కొంత కాలంగా పలు సినిమా ఇండస్ట్రీలలో ప్రముఖులైన వారిని టార్గెట్ చేస్తున్న ఐటి శాఖ అధికారులు వరుసగా సోదాలు నిర్వహిస్తున్నారు. 

 

 

 ప్రస్తుతం తమిళ నటుడు విజయ్ సహ నిర్మాత అన్బు చేజియాన్  ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు సర్వేలు నిర్వహిస్తోంది. ఈ దాడులలో సుమారు 38 ప్రాంగణాలను కవర్ చేశారు అధికారులు. అంతేకాకుండా ఈ ఐటి సోదాల్లో ఏకంగా 65 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఐటీ శాఖ అధికారులు. అయితే విజయ్ హీరోగా బిగిల్  సినిమా అన్బు చేజియన్  బ్యానర్ కింద నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఈ సంస్థలో  గత కొన్ని రోజులుగా అవకతవకలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఇన్కమ్ టాక్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అంతే కాకుండా ఓ చిత్రం షూటింగ్లో ఉన్న విషయం దాదాపు 5 గంటలపాటు ఐటీ అధికారులు విచారించారు . 

 

 

 ఐటి అధికారుల దాడుల్లో  భాగంగా బయటపడిన 65 కోట్ల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అదిరింది సినిమా లో విజయ్ జిఎస్టి పై సెటైర్లు వేయడం... ఇక బిగిల్ సినిమా లో కూడా బీజేపీ ని టార్గెట్ చేస్తూ పలు సెటైర్లు  పేల్చడం లాంటివి చేయడం... అంతేకాకుండా ఇంకొన్ని రోజుల్లో హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ భారీ స్థాయిలో వార్తలు రావడంతో... ఈ ఐటీ దాడులు జరుగుతున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. అయితే మూడేళ్ల క్రితమే విజయ్ పై ఐటి దాడులు జరగ్గా...  మళ్లీ ఇప్పుడు దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. అయితే కేంద్ర ప్రభుత్వం కావాలనే హీరో విజయ్ పై ఇన్కమ్ టాక్స్ దాడులు చేయిస్తోంది అంటూ అభిమానులు కూడా ఆరోపణలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: