వేరియేషన్ స్టార్ అనే మాటకు పర్యాయపదంలా మారుతున్నాడు అక్షయ్ కుమార్. వైవిధ్యం అంటే అక్షయ్.. అక్షయ్ అంటే వైవిధ్యమైన కథలు అన్నట్టు బాక్సాఫీస్ జర్నీ చేస్తున్నాడు. సినిమాకో సోషల్ మెసేజ్ ఇస్తోన్న అక్షయ్.. ఇప్పుడు ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ తో ఖిలాడీని తెరపైకి తీసుకొస్తున్నాడు. 

 

అక్షయ్ కుమార్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మెసేజ్ ఉన్న కథలనే ఎంచుకుంటున్నాడు. ప్యాడ్ మెన్, టాయ్ లెట్ ఏక్ ప్రేమ కథ లాంటి సినిమాలతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాడు. అయితే కొన్నాళ్లుగా వైవిధ్యమైన కథలనే ఎన్నుకుంటున్న అక్షయ్.. ఇప్పుడు ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ కు సైన్ చేస్తున్నాడు. ధూమ్మచాలే అంటూ ధూమ్ 4లో రోబరీస్ చేయబోతున్నాడు. 

 

అక్షయ్ కుమార్ ను అందరూ బాలీవుడ్ యాక్షన్ ఖిలాడీ అని పిలుస్తుంటారు. కానీ కొన్నాళ్లుగా ఈ యాక్షన్ కు దూరంగా ఉంటున్నాడు అక్షయ్. అయితే ఇపుడు యశ్ రాజ్ ఫిల్మ్స్ లో ధూమ్ 4తో మళ్లీ యాక్షన్ లోకి దిగుతున్నాడు. అయితే అమీర్ ఖాన్ దొంగతనాలు చేసిన ధూమ్ 3 బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సందడి చేయలేదు. మరి ఇప్పుడు అక్షయ్ ఎలాంటి మేజిక్స్ చేస్తాడో చూడాలి. 

 

అక్షయ్ కుమాార్ కు బాలీవుడ్ మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలంటే సినీజనాలు పడి చస్తారు. ఆయన మూవీ వెండితెరపైకి ఎపుడు వస్తుందా అని ఆరాటపడుతుంటారు. టికెట్లను సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా.. ఆయన సినిమా చూసి తీరాల్సిందే అనేలా అభిమానాన్ని చాటుకుంటారు. అలాంటి అక్షయ్ కుమార్ ధూమ్ 4తో రాబోతున్నాడు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కోసం సినీ జనాలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ధూమ్ 4లో ఆయన యాక్టింగ్ ఏమైనా డిఫరెంట్ గా ఉందా అని ఉత్కంఠతో ఉన్నారు. అక్షయ్ డ్యాన్స్.. యాక్టింగ్ తో మెస్మరైజ్ చేయనున్నారని బలంగా నమ్ముతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: