పూరీజ‌గ‌న్నాథ్ - చార్మీ వీరిద్ద‌రూ క‌లిసి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లె వీరిద్ద‌రు క‌లిసి తెర‌కెక్కించిన చిత్రం రామ్ హీరోగా ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం తెర‌కెక్కింది ఈ చిత్రం మంచి హిట్ కావ‌డంతో వీరిద్ద‌రు క‌లిసి మ‌రో చిత్రం తెర‌కెక్కించ‌నున్నారు. ఈ చిత్రానికి ఫైట‌ర్ అనే టైటిల్ ను విజ‌య్‌దేవ‌ర‌కొండ న‌టిస్తున్నాడు. 

 

ఇక ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టులోకి కరణ్ జొహార్ వచ్చి చేరడం, తెలుగుతోపాటు ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయాలనుకోవ‌డంతో జరిగింది. దాంతో ఈ ప్రాజెక్ట్‌లోకి క‌ర‌ణ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ చిత్ర టైటిల్‌ని మార్చే ఆలోచ‌న‌లో ఉన్నారని స‌మాచారం.  ఒక‌ర‌కంగా కథ ప‌రంగా ఈ సినిమాకి  'లైగర్' అనే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో కరణ్ - పూరి వున్నారని సమాచారం. మగ సింహానికీ, ఆడపులికి పుట్టిన పిల్లను 'లైగర్స అని అంటారు.

 

ఇక ఈ చిత్రంతో అనన్య‌పాండే హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌వుతుంది.  లైగ‌ర్ అనేది ఎవ్వ‌రికీ తెలియ‌దు ఒక‌ర‌కంగా చెప్పాలంటే అదొక కొత్త ప‌దం అయిపోతుంది. తెలియ‌ని టైటిల్‌ను జనంలోకి తీసుకువెళ్ళ‌డానికి పెద్ద‌గా ఒప్పుకోడు. జ‌నం నోళ్ళ‌లో నానుతున్న టైటిల్స్ పెట్ట‌డానికే పూరి జ‌గ‌న్నాధ్ ఇష్ట‌ప‌డ‌తాడు. అటువంటి పూరి ఇప్పుడు లైగ‌ర్ అని పెట్ట‌డానికి ఒప్పుకోక‌పోవ‌చ్చు. ఫైట‌ర్ అనేది ఇంగ్లీషు ప‌దం వీళ్ళెవ‌రో కాల‌క్షేపం కోసం పెట్టిందే త‌ప్ప నిజం కాక‌పోవ‌చ్చు. ఎందుకంటే ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న తీస‌ని చిత్రాల టైటిల్స్ అన్నీ కూడా `ఇడియ‌ట్‌`, పైసావ‌సూల్‌, అమ్మానాన్న త‌మిళ‌మ్మాయి, ఇస్మార్ట్ శంక‌ర్ లాంటి టైటిల్స్ ఉన్నాయి. అవి అంద‌రికి తెలిసిన ప‌దాలే కావ‌డంతో కొత్త‌గా ఉండేవి పెట్ట‌డానికి పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌డు.  సినిమాకి స‌గం క్రేజ్ అనేది ఏదో విధంగా ఇవ్వాల‌ని కాబ‌ట్టి ఇలా చెబుతున్నార‌ని కొంద‌రు అంటున్నారు. జ‌నం ప్ర‌చారంలో ఉన్న టైటిల్‌ని పెట్ట‌డానికి ఇష్ట‌ప‌డ‌తాడు. ఫైట‌ర్ మాత్ర‌మే ఖాయం చేసే అవ‌కాశాలు ఎక్కువ ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: