టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది నటులు సినీ రంగంలోనే కాదు.. రాజకీయ రంగంలో కూడా గొప్ప పేరు సంపాదించారు.  మరికొంత మంది కంటి కూడా కనిపించకుండా పోయారు.  టాలీవుడ్ లో నటసార్వభౌముడిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా కొనసాగారు.  ఏపిలో ప్రస్తుతం టీడీపీ కొనసాగుతుంది.  ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం సొంతంగా ‘ప్రజారాజ్యం’ పార్టీ పెట్టి తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేశారు.  యూపీఏ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ఇక మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఐదేళ్ల క్రితం ‘జనసేన’ పార్టీ స్థాపించారు.

 

గత ఏడాది ఏపిలో జరిగిన ఎన్నికల సందర్భంగా ఈ పార్టీ నుంచి ఆయన రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు.  ఏపిలో జనసేన, టీడీపీ, బీజేపీ ప్రతిపక్ష హోదాలో ఉన్నాయి.  తాజాగా వీరిబాటలో తమిళ స్టార్ హీరో విజయ్ వెళ్తున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. గతంలో విజయ్ తండ్రి దేశంలో అవినీతి బాగా పేరుకు పోయిందని.. దాన్ని ప్రక్షాళణ చేయడానికి తన తనయుడు వస్తాడని అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి.  గతంలో కూడా  తాను రాజకీయాల్లోకి రావొచ్చు అని విజయ్ కూడా అన్నారు.  ఆ మద్య మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన సర్కార్ మూవీలో రాజకీయ నేపథ్యంలో సాగిందే కావడం విశేషం.  ఇదిలా ఉంటే.. హీరో విజయ్ ఇంట, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. విజ‌య్ రాజ‌కీయ పార్టీ పెడుతున్నాడ‌న్న ప్రచారం త‌మిళ‌నాట జోరుగా న‌డుస్తోంది.

 

అయితే అది ఇప్పుడు భవిష్య‌త్తులోనా అన్న‌ది తెలియ‌ట్లేదు... ఇక ప్ర‌స్తుతం చూస్తే జీఎస్టీ (వస్తు- సేవా పన్ను) అధికారులు సినీ తారల్ని వెంటాడి వేటాడుతున్న సంగతి తెలిసిందే. ఈ గురువారం కోలీవుడ్ స్టార్ హీరో .. ఇలయదళపతి విజయ్ పై ఆకస్మిక దాడులు నిర్వహించడం సంచలనమైంది. ఇక ఈ దాడుల్లో 65 కోట్ల మేర క్యాష్ విజయ్ కి సన్నిహితుడైన ఫైనాన్షియర్ అన్బు చెలియన్ వద్ద పట్టుబడింది. ఈ సందర్భంగా ఆ డబ్బుతో విజయ్ కి ఉన్న లింకులపైనా ఐటీ అధికారులు ఆరాలు తీసారు.  మరోవైపు ఇది బీజేపీ కుట్ర అని విజ‌య్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. మరి భవిష్యత్ లో హీరో విజయ్ పార్టీ పెడతారా.. పోటీ చేస్తాడా అన్న విషయాలపై కోలీవుడ్ లో తెగ చర్చలు నడుస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: