పెళ్లిచూపులు సినిమాతో హీరోగా అవతారం ఎత్తిన యువ నటుడు విజయ్ దేవరకొండ, తొలి సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నాడు. ఆ తరువాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా సూపర్ డూపర్ హిట్ తో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన విజయ్ కు ఇటీవల కెరీర్ పరంగా పెద్దగా సక్సెస్ లు లేవు, ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా సాంగ్స్ కు మంచి స్పందన లభించగా, నేడు యూట్యూబ్ లో సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. 

 

ఇక ట్రైలర్ ఆద్యంతం ఎంతో ఎమోషనల్ గా హృదయానికి హత్తుకునే సీన్స్, డైలాగులతో సాగుతుంది. ఈ సృష్టిలో నిస్వార్ధం అయినది ప్రేమ, అయితే ఆ రెండు పదాలు ఎంతో పెద్ద సునామీని సృష్టించగలవు అంటూ హీరో విజయ్ చెప్పే డైలాగ్ తో ప్రారంభం అయ్యే ఈ ట్రైలర్ మొత్తం కొన్ని రొమాంటిక్, యాక్షన్ సీన్స్ తో పాటు హృదయానికి హత్తుకునే ఎమోషనల్ సీన్స్ తో సాగుతుంది. ప్రేమ గురించి, అలానే లైఫ్ గురించి తెలిపే విధంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ట్రైలర్ ని బట్టి చూస్తే మనకు చాలా వరకు అర్ధం అవుతుంది. నేను వరల్డ్ ఫేమస్ లవర్ అని నిరూపించుకోవాలి అంటూ హీరో చెప్పే డైలాగ్ అతడి క్యారెక్టర్ యొక్క ఫీల్ ని మనకు తెలియచేస్తుంది. 

 

ఇక ట్రయిలర్ చివర్లో తన గుండెలోని బాధలు తెలియకుండా ఉండడానికి తనకు ఫిజికల్ గా గాయాలు, బ్లడ్ ఉండాల్సిందే అంటూ  హీరో చెప్పే డైలాగ్స్ కొంత కదిలిస్తాయి. మొత్తంగా ఎంతో ఆకట్టుకునే విధంగా సాగిన ఈ ట్రైలర్ ని బట్టి చూస్తే గతంలో విజయ్, సందీప్ వంగ ల అర్జున్ రెడ్డి ఛాయలు మాత్రం కొంతవరకు కనపడుతున్నాయని అంటున్న వారు ఉన్నారు. అయితే ఈ నెల 14న రిలీజ్ అయ్యే ఈ సినిమాని చూసిన తరువాతనే అర్జున్ రెడ్డి ఛాయలు ఇందులో ఎంతవరకు ఉన్నాయో చెప్పగలం అని మరికొందరు అంటున్నారు. మొత్తంగా ఈ ట్రైలర్, సినిమాపై మంచి అంచనాలు అయితే క్రియేట్ చేసిందని చెప్పవచ్చు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: